ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరుగుతున్నాయి. మొత్తం పది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కానీ కూటమి పార్టీలు కానీ ప్రత్యక్షంగా పోటీ చేయడం లేదు. అయితే మద్దతు కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు కూటమి పార్టీలను ఆశ్రయిస్తున్నారు.
కూటమి పార్టీలు ఈ విషయంలో తలోదారి అన్నట్లుగానే పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. ఎవరికి మద్దతు ఇవ్వాలి అన్నది కూటమి పార్టీలు అన్నీ కలసి సమిష్టిగా నిర్ణయం తీసుకోకపోవడంతో తమకు నచ్చిన అభ్యర్ధులకు మద్దతు ఇస్తున్నారు. దాంతో గందరగోళం అయితే నెలకొంది.
ప్రస్తుతం సిట్టింగ్ టీచర్స్ ఎమ్మెల్సీ అయిన పాకలపాటి రఘువర్మ మరోసారి ఈ పదవి కోసం పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీల మద్దతు రఘువర్మకే అని స్పష్టం చేశారు.
అయితే పీఆర్టీయూ ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ అయిన గాదే శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీన్ మాధవ్ హాజరయ్యారు. తమ మద్దతు ఆయనకే అని ప్రకటించారు.
కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, బీజేపీలు ఇలా చెరొక అభ్యర్ధికి మద్దతు ప్రకటించడంతో కూటమి పూర్తి సపోర్టు ఎవరికి ఉంటుంది అన్న చర్చ సాగుతోంది. కూటమి పార్టీల మద్దతు పూర్తిగా తమకే ఉండాలని పోటీలో ఉన్న ఈ ఇద్దరు అభ్యర్ధులు కోరుకుంటున్నారు. అయితే కూటమి ఈ విషయంలో ఏ పార్టీ నిర్ణయం ఆ పార్టీదే అన్నట్లుగా వదిలేసిందా అన్నది అంతా తర్కించుకుంటున్నారు.
ప్లే బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,