వాలంటైన్స్ డే గిఫ్ట్.. ఓ ప్రైవేట్ జెట్

జాక్వెలిన్ కు ఇలాంటి ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆమె పుట్టినరోజుకు ఓ పెద్ద పడవను బహుమతిగా అందించాడు.

ప్రేమికుల రోజు కానుకగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అత్యంత ఖరీదైన బహుమతిని అందుకుంది. ఆమెకు ఓ ప్రైవేట్ జెట్ విమానాన్ని బహుమతిగా అందించాడు ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్. జైలు నుంచే ఆమెకు ప్రేమ లేఖ రాశాడు.

తను రాసిన ఉత్తరంలో జాక్వెలిన్ ను ‘బేబీ’గా సంబోధించాడు సుఖేష్. ఆమెకు ప్రేమికుల రోజులు శుభాకాంక్షలు చెబుతూనే, బహుమతిగా ఓ ప్రైవేట్ జెట్ ను కానుకగా ఇస్తున్నట్టు అందులో రాశాడు.

ఆ జెట్ పై ఎవ్వరూ ఎలాంటి అభ్యంతరాలు చెప్పరని, ఎందుకంటే దానికి గిఫ్ట్ ట్యాక్స్ కట్టానని, అంతా లీగల్ గా ఉందని లేఖలో పేర్కొన్నాడు సుఖేష్. తన ప్రేమకు గుర్తుగా విమానంపై జాక్వెలిన్ పేరు రాయించాడట సుఖేష్. అంతేకాదు, జాక్వెలిన్ పుట్టినరోజు కలిసొచ్చేలా రిజిస్ట్రేషన్ చేయించాడట.

జాక్వెలిన్ కు ఇలాంటి ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆమె పుట్టినరోజుకు ఓ పెద్ద పడవను బహుమతిగా అందించాడు. మొన్న జరిగిన క్రిస్మస్ కు ఏకంగా పారిస్ లోని ఓ వైన్ యార్డ్ ను బహుమతిగా అందించాడు. మరో జన్మ అంటూ ఉంటే జాక్వెలిన్ హృదయంగా జన్మిస్తానని లేఖలో పేర్కొన్నాడు సుఖేష్.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అసలు సుఖేష్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడు తన ప్రియుడు కాదని వాదిస్తోంది జాక్వెలిన్. కోర్టు ముందు కూడా ఇదే విషయం చెప్పింది. ఇటువైపు నుంచి సుఖేశ్ మాత్రం ఆమెకు లేఖలు రాస్తున్నాడు, ఖరీదైన బహుమతులు అందిస్తున్నాడు. 200 కోట్ల రూపాయల దోపిడీ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు సుఖేష్.

10 Replies to “వాలంటైన్స్ డే గిఫ్ట్.. ఓ ప్రైవేట్ జెట్”

Comments are closed.