మోదీ కులంపై రేవంత్ సంచ‌ల‌న కామెంట్స్‌

మోదీ గుజ‌రాత్ సీఎం అయ్యాకే, ఆయ‌న కులాన్ని బీసీల్లో క‌లిపార‌ని రేవంత్‌రెడ్డి అన్నారు.

ప్ర‌ధాని మోదీ కులంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. హైద‌రాబాద్ గాంధీభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన కుల‌గుణ‌న‌, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌లో రేవంత్ కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. మోదీ బీసీ కాద‌ని అన్నారు. 2002 వ‌ర‌కు మోదీ ఉన్న‌త వ‌ర్గ‌మే అన్నారు.

అయితే మోదీ గుజ‌రాత్ సీఎం అయ్యాకే, ఆయ‌న కులాన్ని బీసీల్లో క‌లిపార‌ని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ విషయాల‌న్నీ తెలుసుకునే మాట్లాడుతున్న‌ట్టు రేవంత్ చెప్పుకొచ్చారు. లీగ‌ల్లీ క‌న్వ‌ర్టెడ్ బీసీగా రేవంత్ అభివ‌ర్ణించారు. స‌ర్టిఫికెట్ ప్ర‌కార‌మే మోదీ బీసీ అని అన్నారు. మోదీ వ్య‌క్తిత్వం మాత్రం అగ్ర‌కుల‌మ‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

అలాగే కుల‌గ‌ణ‌న‌లో పాల్గొన‌ని మాజీ సీఎం కేసీఆర్‌, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఆ పార్టీ ముఖ్య నేత హ‌రీష్‌రావుల‌ను సామాజిక బ‌హిష్క‌ర‌ణ చేయాల‌ని రేవంత్ డిమాండ్ చేశారు. అలాగే రేవంత్‌రెడ్డి చివ‌రి రెడ్డి సామాజిక వర్గ సీఎం అని కొంద‌రు విమ‌ర్శించ‌డంపై ఆయ‌న ఘాటుగా స్పందించారు. తాను ఆఖ‌రి రెడ్డి సీఎం అయినా ఫ‌ర్వాలేద‌న్నారు. త‌మ నాయ‌కుడు రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట నిల‌బెట్టుకునేందుకు క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త తీసుకున్న‌ట్టు రేవంత్ తెలిపారు.

మోదీ బీసీ కాద‌న్న రేవంత్‌రెడ్డి కామెంట్స్‌పై బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు విరుచుకుప‌డ్డారు. రాహుల్ కులం ఏదో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

8 Replies to “మోదీ కులంపై రేవంత్ సంచ‌ల‌న కామెంట్స్‌”

  1. ప్లే బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా,

Comments are closed.