100 కోట్లు.. 1 మిలియన్.. ఏది ముందు?

ప్రీమియర్స్ తో కలిపి మొదటిరోజు చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించిన ఈ సినిమా, వీకెండ్ తో సంబంధం లేకుండా పడిపోతూ వచ్చింది.

పాజిటివ్ రివ్యూలతో మొదలైన తండేల్ ఇప్పుడు కిందామీద పడుతోంది. ఫస్ట్ వీకెండ్ బాగానే నడిచిన ఈ సినిమా ప్రస్తుతం తక్కువ ఆక్యుపెన్సీతో కొనసాగుతోంది. ఇటు వంద కోట్ల రూపాయల పోస్టర్ కు, అటు మిలియన్ డాలర్ మార్క్ కు అడుగు దూరంలో నెమ్మదించడం యూనిట్ కు టెన్షన్ గా మారింది.

మొదటి 2 రోజులు ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి వంద కోట్లు గ్యారెంటీ అనుకున్నారు. ‘నాగచైతన్యకు రికార్డ్ ఇస్తున్నాం’ అంటూ వేదికలపైనే ఘనంగా ప్రకటించుకున్నారు. కానీ తండేల్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో అపసోపాలు పడుతోంది.

నిన్నటితో ఫస్ట్ వీక్ (7 రోజుల రన్) పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 90.12 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. వంద కోట్ల పోస్టర్ పడాలంటే మరో 10 కోట్లు రావాలి. ఈ వీకెండ్ అంత మొత్తం రావడం దాదాపు అసాధ్యం.

దీనికి ఓ కారణం ఉంది. ఓవర్సీస్ లో ఈ సినిమా ఊహించని విధంగా డిప్ అయింది. ప్రీమియర్స్ తో కలిపి మొదటిరోజు చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించిన ఈ సినిమా, వీకెండ్ తో సంబంధం లేకుండా పడిపోతూ వచ్చింది. టిక్కెట్ డిస్కౌంట్ల తర్వాత కాస్త కోలుకున్నట్టు కనిపించినప్పటికీ మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

5 Replies to “100 కోట్లు.. 1 మిలియన్.. ఏది ముందు?”

  1. I am not talking about the movie, but the Telugu audience should not encourage producer like AA, as his family keeps making films that promote crime, abuse, and arrogance, like Pushpa 2????

Comments are closed.