డబ్బులు తీసుకోకుండా నటిస్తావా విష్ణు?

ప్రభాస్ సినిమాలో ఏదైనా మంచి పాత్ర ఉంటే నటించడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని ఇదివరకే విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే.

త్వరలోనే ‘స్పిరిట్’ సినిమా ప్రారంభించబోతున్నాడు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చారు. వయసుతో సంబంధం లేకుండా పురుషులు-స్త్రీలు-పిల్లలు అంతా సంప్రదించవచ్చని, కాస్త ఫిలిం-థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉంటే చాలని ప్రకటించారు.

ఈ ప్రకటనను ట్యాగ్ చేశాడు మంచు విష్ణు. తను కూడా స్పిరిట్ లో ఛాన్స్ కోసం అప్లయ్ చేశానని ప్రకటించాడు. యూనిట్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో చూద్దాం అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రభాస్ సినిమాలో ఏదైనా మంచి పాత్ర ఉంటే నటించడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని ఇదివరకే విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే.

విష్ణు పోస్టుపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. స్పిరిట్ లో డబ్బులు తీసుకోకుండా ఉచితంగా నటిస్తావా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి ఓ కారణం ఉంది.

విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషించాడు ప్రభాస్. అందులో నటించినందుకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదు, ఫ్రీగా సినిమా చేశాడు. ఈ విషయాన్ని విష్ణు స్వయంగా బయటపెట్టాడు. సో.. స్పిరిట్ లో ఛాన్స్ ఇస్తే విష్ణు కూడా ఫ్రీగా నటించాల్సి ఉంటుందంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

10 Replies to “డబ్బులు తీసుకోకుండా నటిస్తావా విష్ణు?”

  1. ప్రభాస్ లాంటివాళ్లు ఫ్రీ గా నటించారని చెపితే.. ఆ క్యారెక్టర్ అంత బాగుందేమో అనుకొంటారు..

    విష్ణు ఫ్రీ గా నటించాడని చెప్పుకుంటే.. విష్ణు కి కూడా డబ్బు ఇవ్వలేని పరిస్థితుల్లో నిర్మాత ఉన్నాడా అనుకొంటారు.. ఇక సినిమా బొక్కలాగా ఉంటుంది అనే ఫీలింగ్ వెళ్లే ప్రమాదం ఉంది..

    ..

    విష్ణు సినిమా కి ప్రభాస్ బలం అవుతాడు..

    ప్రభాస్ సినిమా కి విష్ణు.. బలహీనత కాకుంటే చాలు..

    ..

    ఇక చాలూ ..! అని ప్రభాస్ ఇక్కడ అరవాల్సి వస్తుంది..

    1. అలా అనుకోరు,వీడికి డబ్బులు ఇవ్వడం అవసరమా అవకాశం ఇవ్వడమే గొప్ప అనుకుంటారు.

  2. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ దగ్గర కాజేసిన డబ్బు , సమ్మోహనం దగ్గర దాచిపెట్టుకుంటే, ఆ డబ్బు నొక్కేసి అనేక వ్యాపారాలు మొదలు పెట్టారు అని అంటారు, కిట్టని వాళ్ళు.

Comments are closed.