జ‌య‌ల‌లిత ఖ‌జానాలో బంగారు కిరిటీ, స్వ‌ర్ణ‌ఖ‌డ్గం.. ఇంకా!

స్థూలంగా జ‌య‌ల‌ల‌లిత ఆస్తుల విలువ నాలుగున్న‌ర వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉండ‌వ‌చ్చ‌ని ఒక అంచ‌నా!

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లితకు సంబంధించిన ఖ‌జానా క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడుకు చేరుకుంది. జ‌య‌ల‌లిత అక్ర‌మాస్తుల కేసుల విచార‌ణ ద‌శాబ్దాల కింద‌టే క‌ర్ణాట‌క‌కు బ‌దిలీ అయ్యింది. అప్ప‌టి నుంచి జ‌య‌ల‌లిత‌, ఆమె స‌న్నిహితులు అరెస్టు అయిన‌ప్పుడు, శిక్ష‌లు క‌ర్ణాట‌క‌లోని ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైల్లోనే ఉంటూ వ‌చ్చారు. కేసుల బ‌దిలీ నేప‌థ్యంలో జ‌య‌ల‌లిత నుంచి విచార‌ణ సంద‌ర్భంగా జ‌ప్తు చేసిన వ‌స్తువులు కూడా ఇన్నేళ్లూ క‌ర్ణాట‌క‌లోనే ఉంటూ వ‌చ్చాయి.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణించి దాదాపు ద‌శాబ్ద స‌మ‌యం కావొస్తూ ఉంది. ఆ కేసుల్లో శిక్ష‌ను ఎదుర్కొన్న శ‌శిక‌ళ కూడా చాన్నాళ్ల కింద‌టే శిక్ష‌ను పూర్తి చేసుకుని జైలు నుంచి విడుద‌ల అయ్యి త‌మిళ‌నాడుకు వెళ్లిపోయారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే జ‌య‌ల‌లిత వ‌స్తువుల గురించి కోర్టు తీర్పునిస్తూ ఆమె యావ‌దాస్తీ ఆమె వార‌సులుగా చెప్పుకుంటున్న ఎవ్వ‌రికీ ద‌క్క‌ద‌ని, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికే చెందుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

దీంతో ఇన్నాళ్లూ ఆమె వ‌స్తువుల‌కు కాప‌లా కాసిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఒక పెద్ద వాహ‌నంలో త‌మిళ‌నాడుకు వాటిని చేరవేసింది. ఈ కేసు విచార‌ణ‌కూ, జ‌య‌ల‌లిత వ‌స్తువులు, బంగారానికి కాప‌లా కాసినందుకు త‌మ‌కు ఐదు కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు అయ్యింద‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కోర్టుకు నివేదించింది. ఈ మేర‌కు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఆ డ‌బ్బును క‌ర్ణాట‌క‌కు చెల్లించాల‌ని కూడా కోర్టు స్ప‌ష్టం చేసింది.

ఇక త‌మిళ‌నాడుకు చేరి జ‌య‌ల‌లిత ఆస్తుల్లో న‌గ‌న‌ట్రా వంతు గ‌ట్టిగా ఉంది. ఏకంగా 27 కిలోల బంగార‌మే ఉంద‌ట‌, ఇక వ‌జ్రాలు పొదిగిన ఆభర‌ణ లెక్క వేరే! అలాగే ఆమెకు ఎక్క‌డెక్క‌డ భూములున్నాయ‌నే ప‌త్రాలు, ఇత‌ర వివ‌రాలు అన్నీ కూడా ఇప్పుడు త‌మిళ‌నాడుకు చేరాయి. ఆమె బంగారు ఆభ‌ర‌ణాల సంగ‌తెలా ఉన్నా.. ఒక స్వ‌ర్ణ‌ఖ‌డ్డం, ఇంకా బంగారు కిరీటం కూడా జాబితాలో ఉన్నాయ‌ని తెలుస్తోంది. త‌మ‌కు చేరిన జ‌య వ‌స్తువుల వీడియోల‌ను తీయించింది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం.

స్థూలంగా జ‌య‌ల‌ల‌లిత ఆస్తుల విలువ నాలుగున్న‌ర వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉండ‌వ‌చ్చ‌ని ఒక అంచ‌నా! వీటిని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం, ప్ర‌భుత్వ ఖ‌జానాలో జ‌మ చేయ‌వ‌చ్చు. మ‌రి ఆమె చెప్పులు, చీర‌లు కూడా ద‌శాబ్దాలుగా వార్త‌ల్లో నిలుస్తున్న‌వే. వాటిని ప్ర‌భుత్వం గ‌నుక వేలం వేస్తే.. జ‌య‌ల‌లిత వీరాభిమానులు, ప్రైవేట్ మ్యూజియంల వాళ్లు ఎగ‌బ‌డి కొనుక్కొనే అవ‌కాశాలు కూడా ఉంటాయి. మ‌రి ఈ విష‌యంలో స్టాలిన్ ప్ర‌భుత్వం ఆలోచ‌న ఏమిటో!

10 Replies to “జ‌య‌ల‌లిత ఖ‌జానాలో బంగారు కిరిటీ, స్వ‌ర్ణ‌ఖ‌డ్గం.. ఇంకా!”

    1. రే.. పకోడీ…సుజనా, సోమిరెడ్డి, సీఎం రమేష్, ఇలా చెప్పుకుంటూ.. పోతే.. బొల్లి గాడి ఉన్న బినామీ లిస్ట్ కొండవీటి చాంతాడంత ఉంది..ఇవి కాక… ఇండియా తరువాత… సింగపూర్ తో నుండి.. మొదలు పెడితే.. USA స్విస్ దుబాయ్ ఇలా దేశాలలో.. మీ బొల్లి గాడి డబ్బు లెక్కలేనంత!

      అసలు.. హవాలా… సొమ్ము ఇండియా లోకి తేవటం లో.. ఆరితేరిన గుర్రాల వ్యాపారి హస్సన్ అలీ వీడి శిష్యుడే ! బచ్చా గాడివి.. ఈ లింకులన్నీ తెలుసుకో ముందు అవివేకంగా పొద్దుపోని.. kv తలు మాట్లాడే ముందు!

  1. I think courts should treat all politicians from Kashmir to Kanyakumari the same; this would help clear all of India’s debts, and the remaining money could be invested in infrastructure development. It’s very hard to find uncorrupted politicians these days. Total digital currency will solve this problem since it’s easy to track.

Comments are closed.