లైలా.. ఆ లైన్ కూడా కాపీ యేనా!

త‌న మేక‌ప్ తో ఒక యువ‌తిని అందగ‌త్తెగా త‌యారు చేసి వేరొక‌రికి పెళ్లి చేసే కామెడీ సీన్ ఒక‌టి పాత సినిమాలో ఉంటుంది.

అరివీర భ‌యంక‌ర‌మైన బిల్డ‌ప్పులు ఇచ్చి, మెగాస్టార్ చిరంజీవితో ప్ర‌చారం సైతం చేయించుకుని, ఇంకా అర్ధ‌రాత్రి మిడిల్ ఫింగ‌ర్లు చూపించి.. నానా ర‌చ్చ చేసి.. చివ‌ర‌కు లైలా తొలి ఆట‌తోనే షాకింగ్ ఫ‌లితాన్ని చ‌విచూసింది. సినిమా క‌థా, క‌థ‌నాల సంగ‌తెలా ఉన్నా.. అన‌విగాని బూతుల‌తో ఈ సినిమా తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతూ ఉంది.

యువ హీరోలు ఇలా బూతుల‌ను న‌మ్ముకోవ‌డం విస్మ‌య‌క‌ర‌మే. ఆ సంగ‌త‌లా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి రివ్యూల్లో వినిపిస్తున్న లైన్ కూడా ఏ మాత్రం కొత్త కాదు. వాస్త‌వానికి హీరో పాత్ర‌ధారి ఆడ‌వేషం వేసే సినిమాలు బోలెడు వ‌చ్చాయి. ప్ర‌త్యేకించి 1993లో వ‌చ్చిన హాలీవుడ్ సినిమా మిసెస్ డౌట్ ఫైర్ ను స్పూర్తి పొంది తెలుగు, ద‌క్షిణాది భాష‌ల్లో చాలా సినిమాలు వ‌చ్చాయి.

క‌మ‌ల్ హాస‌న్ భామ‌నే స‌త్య‌భామ‌నే అంటూ తీశారు. ఆ త‌ర్వాత సింగీతం ద‌ర్శ‌క‌త్వంలోనే మేడ‌మ్ సినిమా వ‌చ్చింది. హీరో పాత్ర‌ధారి సినిమా లో చాలా సేపు ఆడ‌వేషంలో కొన‌సాగే క‌థ‌లు అవి. మిసెస్ డౌట్ ఫైర్ లో క‌థ‌ను భామ‌నే స‌త్య‌భామ‌నే లో వాడుకుంటూ, కామెడీ సీన్ల‌తో ఆక‌ట్టుకున్నారు. మేడ‌మ్ సినిమా ఆడ‌లేదు. ఈ సినిమాల‌కు కాస్త అటూఇటూగా వ‌చ్చిన జంధ్యాల సినిమాలో కూడా హీరో ఆడ‌వేషం వేస్తాడు. వాస్త‌వానికి వీట‌న్నింటిక‌న్నా ముందు చిత్రం భ‌ళారే విచిత్రం వ‌చ్చింది. ఇది హాలీవుడ్ సినిమా క‌న్నా ముందే వ‌చ్చిన సినిమా! అది కూడా బోలెడు బూతుల‌తో నిండినా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కామెడీ క్లాసిక్స్ లో నిలిచిపోయింది.

ఇక లైలా సినిమాకు ఎలాగూ అలాంటి సినిమాల‌తో పోల్చే సీన్ లేదు కానీ, త‌న మేక‌ప్ తో ఒక యువ‌తిని అందగ‌త్తెగా త‌యారు చేసి వేరొక‌రికి పెళ్లి చేసే కామెడీ సీన్ ఒక‌టి పాత సినిమాలో ఉంటుంది. బాబూమోహ‌న్, బ్ర‌హ్మానందంల సీన్ అది. అందులో బాబూ మోహ‌న్ ఒక ల‌వ్ గురూ. అత‌డి వ‌ద్ద‌కు బ్ర‌హ్మానందం వ‌స్తాడు. త‌న‌కో చెల్లి ఉంద‌ని, త‌ను చాలా న‌ల్ల‌గా వికారంగా ఉంద‌ని, ఆమెకు పెళ్లి చేయాలంటే ఏం చేయాలంటూ ఫీజు చెల్లించి స‌ల‌హా అడుగుతాడు. దానికి బాబూ మోహ‌న్ ఆమెకు తెల్ల‌గా క‌నిపించేలా మేక‌ప్ వేసి ఏదైనా బ‌స్టాప్ లో నిల‌బెట్టాల‌ని, ఎవ‌రో ఒక బ‌క‌రా ఆమెకు ప‌డిపోయి పెళ్లి చేసుకుంటాడంటూ స‌ల‌హా ఇస్తాడు.

ఆ త‌ర్వాత బ‌స్టాప్ లో అలా తెల్ల‌గా మెరిసిపోయే ఒక అమ్మాయిని చూసి బాబూ మోహ‌నే మ‌న‌సు పారేసుకుంటాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంట‌ప‌డి పెళ్లి చేసుకుంటాడు. ఆ త‌ర్వాత ఆమె అస‌లు రూపాన్ని చూసి హ‌డ‌లిపోతాడు. త‌ను ఇచ్చిన స‌ల‌హా మేర‌కు , త‌నే బ‌క‌రా అయిన వైనంపై .. సాగే కామెడీ సీన్ అది. మ‌రి ఇలా మ‌రుగున ప‌డ్డ సీన్ల‌ను కూడా వాడుకోవ‌డ‌మే కొత్త సినిమాలు తీయ‌డం కాబోలు అనుకునేలా ఉంది లైలా క‌హానీ!

6 Replies to “లైలా.. ఆ లైన్ కూడా కాపీ యేనా!”

      1. meru cheppedi vere vallaki kతమరు చెప్పేది వేరే వాళ్ళకి కూడా వర్తిస్తుంది .. u

Comments are closed.