తండేల్ తర్వాత కార్తికేయ-3 కాదు?

హీరో సూర్యను కలిశాడు ఈ దర్శకుడు. అతడితో చర్చలు కూడా మొదలుపెట్టాడు

“కథ ఎంత పెద్దదైనా సిద్ధం చేసుకో. బడ్జెట్ 300 కోట్లు అయినా పర్వాలేదు. హీరోగా రామ్ చరణ్ లేదా సూర్యను ఎవరినైనా తీసుకో” కార్తికేయ-2 సక్సెస్ తర్వాత అల్లు అరవింద్ నుంచి దర్శకుడు చందు మొండేటికి వచ్చిన ఓపెన్ ఆఫర్ ఇది. ఈ విషయాన్ని ఈ దర్శకుడు గ్రేట్ ఆంధ్ర ఇంటర్వ్యూలో స్వయంగా బయటపెట్టాడు.

కానీ అతడు తండేల్ కు కనెక్ట్ అయ్యాడు. నాగచైతన్యతో సినిమా తీశాడు. ఇప్పుడా సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మరి చందు మొండేటి నెక్ట్స్ సినిమా ఏంటి?

లెక్క ప్రకారం తండేల్ తర్వాత అతడు కార్తికేయ-3 పనులు మొదలుపెట్టాలి. నిఖిల్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాలి. కానీ అల్లు అరవింద్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్ పై వర్క్ చేస్తున్నాడు చందు మొండేటి.

అవును.. హీరో సూర్యను కలిశాడు ఈ దర్శకుడు. అతడితో చర్చలు కూడా మొదలుపెట్టాడు. ప్రాజక్టు ఓకే అయితే గీతాఆర్ట్స్ బ్యానర్ పైనే చందు-సూర్య కాంబోలో సినిమా ఉంటుంది. ఆ తర్వాత కార్తికేయ-3 మొదలవుతుంది.

నిజానికి సూర్య-బోయపాటి కాంబో కోసం ప్రయత్నించింది గీతా. కానీ బాలయ్య సినిమాకు షిఫ్ట్ అయ్యారు బోయపాటి. దీంతో ఆ అవకాశం చందు మొండేటిని వరించింది.

3 Replies to “తండేల్ తర్వాత కార్తికేయ-3 కాదు?”

Comments are closed.