పయ్యావుల హెచ్చరికలు పురోగతిని దెబ్బతీయవా?

పయ్యావుల కేశవ్ ఇలా కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించరాదంటూ తీసుకున్న నిర్ణయం వల్ల అనేక రకాలుగా రాష్ట్ర పురోగతిపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అధికారులకు తాజాగా సరికొత్త హెచ్చరికలు జారీ చేశారు. తనకు గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గానీ సమాచారం ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి వీల్లేదని హెచ్చరించారు. ప్రత్యేకించి, విశాఖపట్నం రుషికొండలో టూరిజం గెస్ట్ హౌస్‌లను నిర్మించిన కాంట్రాక్టర్ రాష్ట్రంలో ఇంకా ఏ పనులు చేసి ఉన్నా సరే, వారికి బిల్లులు చెల్లించడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు.

అయితే, పయ్యావుల కేశవ్ ఇలా కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించరాదంటూ తీసుకున్న నిర్ణయం వల్ల అనేక రకాలుగా రాష్ట్ర పురోగతిపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.

ఇంతకూ ఏం జరిగిందంటే… రుషికొండలో టూరిజం గెస్ట్ హౌస్‌లు నిర్మించిన కాంట్రాక్టర్ చేపట్టిన వేరే పనులకు సంబంధించి ఆర్థిక శాఖ అధికారులు ఇటీవల బిల్లులు చెల్లించారు. బిల్లుల చెల్లింపు అనేది రెగ్యులర్ ప్రాసెస్‌లో భాగంగా జరిగిపోయింది. అయితే, ఆ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించడంపై కేశవ్ మండిపడ్డారు. వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

‘కాంట్రాక్టు సంస్థ అదే కానీ, వారు చేసిన వేరే పనులకు బిల్లులు ఇచ్చాం’ అని అధికారులు చెప్పినా, కేశవ్ వినిపించుకోలేదు. ‘బిల్లులు చెల్లించరాదని ఇదివరకే చెప్పాను. అయినా నా మాట పట్టించుకోవడం లేద’ని అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘ఇది మీ స్వంత నిర్ణయమా? ఈ బిల్లుల కోసం ఎవరైనా సిఫారసు చేశారా?’ అంటూ కేశవ్ ఆరాతీయడం విశేషం. ఇక మీదట ఆ కాంట్రాక్టు సంస్థ చేసిన ఏ పనులకు కూడా బిల్లులు చెల్లించరాదని తేల్చేశారు.

ఇలాంటి నిర్ణయం ప్రస్తుత ప్రభుత్వం చేపట్టే పనులను పొందే కాంట్రాక్టర్లను భయాందోళనకు గురిచేయదా? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. కూటమి ప్రభుత్వం నుంచి టెండర్లు పొంది పనులు చేపట్టే కాంట్రాక్టర్లు ఈ ఐదేళ్లలోగా బిల్లులు మొత్తం వసూలు చేసుకోలేకపోతే, భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉందని భయపడతారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే, పాలన వైసీపీ చేతిలోకి వెళితే… ఇప్పుడు పయ్యావుల బిల్లులు చెల్లించవద్దు అన్నట్లుగానే జగన్ కూడా ‘ఈ ప్రభుత్వంలో పనులు చేసిన వారెవ్వరికీ బిల్లులు చెల్లించవద్దు’ అని ఆదేశిస్తే, కాంట్రాక్టర్ల పరిస్థితి ఏమిటి?

ఇలాంటి ఆందోళనల మధ్య ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టు పనులు చేయడానికి ముందుకు వచ్చేవారు ఎవరుంటారు? అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఇలాంటి వేధింపు నిర్ణయాలు స్థూలంగా గమనించినప్పుడు రాష్ట్ర పురోగతిని దెబ్బతీస్తాయని అందరూ భావిస్తున్నారు.

8 Replies to “పయ్యావుల హెచ్చరికలు పురోగతిని దెబ్బతీయవా?”

  1. జగన్ 5 ఎళ్ళలొ చెసింది అదెగా? పాపం వాళ్ళు కొర్ట్ కి వెల్లి బిల్లుల డబ్బు తెచ్చుకొవాల్సి వచ్చింది!

  2. అవును, ja*** గాడి ప్రతిష్టను దెబ్బతీస్తాయి!! offcourse వాడికి వాడి ఫ్యామిలీ కి పరువు ప్రతిష్ట లేవనుకో, అది వేరే సంగతి!!

  3. అమర రాజా కంపెనీ ని బిజ్జల గా డు ఏ మంత్రి పదవి లేకుండానే బెదిరించినప్పుడు నోట్లో అన్నియ్య మట్ట పెట్టుకున్నావా ?

Comments are closed.