బీజేపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

సరైన నాయకత్వం ఆ పార్టీకి అక్కడ లేదు. ఆ లోటుని తీర్చేలా వాసుపల్లిని కమలనాధులు ఆహ్వానిస్తారని అంటున్నారు.

తాజాగా వైసీపీ అధినాయకత్వం తీరు మీద పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూటమిలో చేరేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారా అన్నది అంతా తర్కించుకుంటున్నారు.

ఆయన వల్లభనేని వంశీ అరెస్ట్ మీద మాట్లాడుతూ ఆయనతో పాటు కొడాలి నాని కూడా వైసీపీకి చేటు చేశారు అని విమర్శించారు. వారు పార్టీ నుంచి వెళ్ళిపోతేనే వైసీపీ బాగుపడుతుందని అన్నారు. ఆర్కే రోజా కూడా తన మాటల దూకుడు తగ్గించుకోవాలని హితవు పలికారు.

రీజనల్ కో ఆర్డినేటర్లు వైసీపీకి అవసరం లేదు జగన్ తో నేరుగా నాయకులకు అనుసంధానం ఉండాలని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం వైసీపీలో కొందరు నేతలు చేసిన తప్పు అని చెబుతూనే కూటమి పాలనలో అలా ఏవరూ చేయడం లేదని అన్నారు. ప్రత్యర్ధుల పెళ్ళిళ్ళ గురించి మనకెందుకు అని సైతం అన్నారు.

ఇలా ఇండైరెక్ట్ గా కూటమి పార్టీలకు కితాబు ఇచ్చారు. వైసీపీని విమర్శించే విధంగా మాట్లాడారు. దానిని బట్టి ఆయనలో అసంతృప్తి దాగుందని అర్ధం అవుతోంది అంటున్నారు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్. ఆ పార్టీ నుంచే మూడు సార్లు టికెట్ సాధించారు. రెండు సార్లు గెలిచారు.

అయితే వైసీపీ పాలనలో ఆయన ఈ వైపు వచ్చారు. వైసీపీ ఆయనకు 2024లో టికెట్ ఇచ్చింది. కానీ ఓటమి పాలు అయ్యారు. తిరిగి టీడీపీలోకి వెళ్ళాలని ప్రయత్నాలు చేశారని అంటారు. అవి అంతగా ఫలించలేదని ప్రచారంలో ఉంది.

దక్షిణ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ఆ వైపుగా వెళ్ళలేరని అంటున్నారు. అందుకే బీజేపీ వైపు చూస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది. విశాఖ దక్షిణంలో బీజేపీకి కొంత బలం ఉంది. 1999 ఎన్నికల్లో ఒకసారి ఆ పార్టీ గెలిచింది కూడా.

సరైన నాయకత్వం ఆ పార్టీకి అక్కడ లేదు. ఆ లోటుని తీర్చేలా వాసుపల్లిని కమలనాధులు ఆహ్వానిస్తారని అంటున్నారు. ఇలా ఉభయకుశలోపరి గా ఉంటుందని చెబుతున్నారు. వాసుపల్లి బీజేపీలో చేరడం ద్వారా అధికార కూటమిలో భాగం కావాలని అనుకుంటున్నారన్నది సాగుతున్న ప్రచారం.

6 Replies to “బీజేపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?”

  1. ఈ పనికిమాలినోడు.. వైసీపీ ఎమ్మెల్యే ఎప్పుడయ్యాడబ్బా ..?

    వైసీపీ “మాజీ” ఎమ్మెల్యే అని చెప్పుకొంటున్నారు.. సిగ్గొదిలేశారా ..? అసలు సిగ్గు పడటం మానేసారా ?

    ఏమి జాతి రా మీది.. థూ …

    1. పైకి చెప్పెది

      పదవికి రాజీనామా చేశాకే మా పార్టీ లో తీసుకుంటాం: అన్నయ్య

      చేసేది మాత్రం పదవికి రాజీనామా చేయకుండా పార్టీ లోకి తీసుకోవడం

Comments are closed.