బ్యాంక్ వేలానికి సినిమా సెలబ్రిటీ ఇల్లు?

టాలీవుడ్ లోని ఓ సీనియర్ హీరోకి సంబంధించిన ఇల్లు ఒకటి బ్యాంక్ వేలానికి వచ్చే అవకాశం వుందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.

అప్పు చేయడం తప్పు కాదు. కట్టలేకపోవడం అంతకన్న తప్పు కాదు. సినిమా వ్యాపారం అన్నాక అటు ఇటు కావడం కామన్. రాత్రికి రాత్రి జోకర్ పడి ఆట స్వంతమవుతుంది. లేదంటే బోర్డు తిరగబడుతుంది. టాలీవుడ్ లోని ఓ సీనియర్ హీరోకి సంబంధించిన ఇల్లు ఒకటి బ్యాంక్ వేలానికి వచ్చే అవకాశం వుందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.

సదరు సెలబ్రిటీ ఆ ఇంటికి హామీగా పెట్టి బ్యాంక్ లో తీసుకున్న అప్పు బ్యాడ్ డెట్ గా మారిందని తెలుస్తోంది. దీంతో ఇంటిని వేలానికి తీసుకురావాలనే ప్రయత్నాలు బ్యాంక్ అధికారులు చేస్తున్నారని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.

ఇంతకీ వాళ్లకెందుకు ఈ డిస్కషన్ అంటే..ఫిలిం నగర్ లో ఇల్లు అంటే అంత ఈజీ కాదు. ఫిలింనగర్ లో భూమి రేటు చాలా ఎక్కువ. పైగా కొనాలన్నా ఎక్కడా పెద్దగా దొరకదు. అందువల్ల అలాంటి చోట్ల కనుక బ్యాంక్ వేలం వస్తే కొనుక్కోవచ్చు కదా అని కొందరు ఎదురు చూస్తున్నారు.

అయితే పెద్దవాళ్ల ఆస్తులు అంత సులువుగా వేలానికి రావు. మహా అయితే పేపర్ ప్రకటనల వరకు వస్తాయి. ఆ తరువాత ఎంతో కొంత కట్టడమో, ఏదో ఒకటి చేయడమో చేసి ఆపుతారు. చూడాలి ఈ వ్యవహారం ఏమవుతుందో?

12 Replies to “బ్యాంక్ వేలానికి సినిమా సెలబ్రిటీ ఇల్లు?”

Comments are closed.