ప్రీ-రిలీజ్ ఫంక్షన్లలో వెనక నుంచి అరిచే ఆ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏమయ్యారు? “ఇచ్చి పడేద్దాం” అంటూ గోల చేసే ఆ వీరాభిమానులెక్కడ? వేదికపై మాట్లాడుతుంటే దూసుకొచ్చి హీరో కాళ్లపై పడిపోయే ఆ కరడుగట్టిన అభిమాని కనిపించడేం? లైలా సినిమా చూడ్డానికి వీళ్లంతా ఎందుకు ఎగబడడం లేదు?
ఓ హీరోకు అశేష సంఖ్యలో అభిమానులుంటారు. తనకు ఇన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారంటూ ఏ హీరో అంకెలు చెప్పుకోడు. మొదటి రోజు వసూళ్లలో ఆ అభిమానం కనిపిస్తుంది. లేదంటే బెనిఫిట్ షో ఫిగర్లు చూసి ఓ అంచనాకు రావడమే.
లైలా సినిమాకు మొదటి రోజు జస్ట్ కోటి పాతిక లక్షల రూపాయల కలెక్షన్ మాత్రమే వచ్చింది. మరి ఈ లెక్కన చూసుకుంటే విశ్వక్ సేన్ అభిమానుల సంఖ్య ఎంత? ఇంతకుముందు విశ్వక్ నటించిన ఏ సినిమాకూ ఇంత తక్కువ వసూళ్లు లేవు.
నిజానికి ఇది “బాయ్ కాట్ లైలా” ట్రెండ్ కానేకాదు. సినిమా బాగుంటే ఈరోజు నుంచి లైలాను ఆపేవాడు ఉండదు. విషయం లేదు కాబట్టే సినిమా చుట్టచుట్టేసింది. వీకెండ్ అయినా ఆక్యుపెన్సీ కనిపించలేదు. సోమవారం సంగతి సరేసరి.
కేవలం యూత్ ను టార్గెట్ చేసి సినిమా చేశామని, యూత్ అంటే బూతు కాదంటూ విడుదలకు ముందు చాలా చెప్పాడు విశ్వక్. కానీ ఇప్పుడు ఆ యూత్ కూడా విశ్వక్ సినిమాను లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.
ప్లే బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Yekkada
Idhi adult movie bad movie