తనకు అధికారం ఇచ్చింది ప్రత్యర్థులపై, ప్రజలపై, ప్రభుత్వ అధికారులపై నోటికి వచ్చినట్లు తిట్టడానికి, దాడులు చేయడానికే అన్నట్లుగా భావించే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు రావడం విశేషం. అధికారంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, తప్పును తప్పుగా చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని.. కేవలం బూతులు ఒక్కటే మార్గం కాదని, తీరు మార్చుకోవాలని చింతమనేనిని సీఎం హెచ్చరించినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే… మూడు రోజుల క్రితం ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఎమ్మెల్యే చింతమనేని, అక్కడ ఒక కారు అడ్డంగా ఉండటంతో ఆ కారు డ్రైవర్‌పై దుర్భాషలాడి, “చంపేస్తా” అంటూ బెదిరించిన వీడియో వైరల్ అయ్యింది. దాంతో, సంజాయిషీ ఇచ్చేందుకు మీడియా ముందు వచ్చిన చింతమనేని, తన తప్పు లేదని వాదిస్తూ, తాను తిట్టడానికి గల కారణం అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ అని వివరణ ఇచ్చారు. అయితే, అదే సందర్భంలో వైసీపీ నేతలపై నీచంగా మాట్లాడటంతో, ఈ వివాదం మరింత ఎక్కువైంది. తప్పు చేసినా వైసీపీ వారిపై కేసులు పెట్టడం వల్ల పరిస్థితి మరింత రగిలిపోయింది.
కాగా, ఇప్పటికే కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలపై అధికార పత్రికలే అవినీతి ఆరోపణలపై కథనాలు రాస్తున్నాయి. కొన్ని చోట్ల నాయకుల అగడాల వీడియోలు బయటకు వస్తున్నప్పుడు సీఎం చంద్రబాబు వారిని హెచ్చరిస్తున్నారు. ఇదే వైఎస్ జగన్ హయాంలో జరిగితే, ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులతో కనీస వివరణ కూడా తీసుకునే వారు కాదు అని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
టీడీపీ అధికారంలో ఉన్న 2014-19 కాలంలో, ఓ మహిళా అధికారిపై చింతమనేని రెచ్చిపోయిన ఘటన వల్ల ఆ ఎన్నికల్లో పార్టీకి ఎంత చెడ్డపేరు వచ్చిందో అందరికి తెలిసిందే. ఇప్పటికైనా చంద్రబాబు హెచ్చరికలతో చింతమనేని తన తీరు మార్చుకోవాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి.
Finally GA is recognizing difference between Chandrababu and Jagan.
ఏమని.. ? ఏంటింత మర్యాదగా ఉన్నావ్… మన ఆఫీసియల్ లాంగ్వేజ్ ని పూర్తిగా వాడటం లేదంటి ఆ నా. ?
ప్లే బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
ఇలా జగన్ ఎప్పుడన్నా వారించారా? ఎంత ఎక్కువ బూ.-.తు.-.లు తిడితె అంతగా మెచ్చుకొని పదవులు ఇచ్చారు! అసలు బూ.-.తు.-.లు తిట్టందె Y.-.C.-.P లొ మంత్రి కాలెదు అని అప్పట్లొ అనుకున్నారు!
గుడ్కా నాని, వల్లభనెని వంశి, రొజా, అనిల్ కుమర్ యాదవ్, జొగి రమెష్, అంబటి రాంబాబు, విజయ సాయి రెడ్డి, పెద్ది రెడ్డి రమ చెంద్రా రెడ్డి, తమ్మినెని సీతారాం, ద్వరంపూడి చంద్ర సేకర్ రెడ్డి .. వీల్లందరి బూ.-.తు.-.లకి బులుగు మీడియా ఫైర్ బ్రండ్ అంటూ పొడిగింది!
“చంద్రబాబు Leader” కాబట్టి దౌర్జన్యం చెయ్యడం, భూతులు తిట్టడం మంచి పద్ధతి కాదు అని మందలించాడు
అదే మా “A1లోఫర్ ల0గాగాడు” ఐతే, తిట్టమని భూతుల SCRIPT పంపుతుండేవాడు..
కు. తో . వంక ..ర సవరదీస్తే సాఫు అయ్యిపోతుందా? అసలు పెంచే వాడిదీ త ..ప్పు
Y sir