సరైన జోడీ డేటింగ్‌లో ఉన్నారట

ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అలా అని ముంబయి జోడీల మాదిరిగా ఎక్కడా ఈ ఇద్దరూ కలిసి కనిపించడం లేదు.

ఆ ఇద్దరిని చూస్తే సరైన జోడీ అంటారు ఎవరైనా. అలా ఉంటారు ఆ ఇద్దరు హీరో హీరోయిన్లు. ఆమె తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. సినిమా అరివీర డిజాస్టర్ అయినా కూడా మంచి అవకాశాలు ఆమెకు వచ్చాయి. వస్తున్నాయి అంటే దానికి కారణం ఆమె అందచందాలే. చీరకట్టులో ఆమెను చూస్తే కళ్లు అప్పగించి ఉండాల్సిందే.

ఇంతకీ అతగాడి సంగతి చెప్పలేదు కదా? ఈమెకు తీసినపోని కలర్. మంచి హ్యాండ్‌సమ్ లుక్స్. పైగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అన్నిటికంటే ముఖ్యంగా సినిమా హీరో. అంతకన్నా ఇంకేం అర్హతలు కావాలి?

ఇప్పుడు ఈ ఇద్దరూ మంచి రిలేషన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అలా అని ముంబయి జోడీల మాదిరిగా ఎక్కడా ఈ ఇద్దరూ కలిసి కనిపించడం లేదు. అది వేరే సంగతి. కానీ ఈ వైనం విన్నవాళ్లు, తెలిసినవాళ్లు మాత్రం “సరైన ఈడు-జోడు, పెళ్లి చేసుకుంటే భలే ఉంటుంది!” అని కామెంట్ చేస్తున్నారు. చేసుకుంటే టాలీవుడ్‌లో మరో సౌత్-నార్త్ జంట అవుతుంది. ఇప్పటికే చాలా సౌత్-నార్త్ జంటలు ఉన్నాయి టాలీవుడ్‌లో.

ప్రస్తుతం వీరు కలిసి చేస్తున్న సినిమా షూటింగ్ ఫాస్ట్‌గా సాగుతోంది. అది వేరే సంగతి.

20 Replies to “సరైన జోడీ డేటింగ్‌లో ఉన్నారట”

  1. Puri dunnesaka veediki double dimag damage ayipoyi Ravi thatha pant laagaka inkemanna laagataaniki vundaa ani vetukutunattu vunnadu. endi ra avi cinemalu veellu actors. saripoyaru.

Comments are closed.