పింక్ బుక్‌లో రాసుకుంటున్నార‌ట‌!

అధికారంలోకి వ‌చ్చిన వాళ్లు అభివృద్ధి, అలాగే హామీల అమ‌లుపై కాకుండా, ప్ర‌త్య‌ర్థుల‌పై ప్ర‌తీకారం తీర్చుకునే రాజ‌కీయ విష సంస్కృతి రోజురోజుకూ పెరుగుతోంది.

ఏపీలో రెడ్‌బుక్ గురించి తెలుసు. ఇప్పుడు తెలంగాణ‌లో పింక్‌బుక్ తెర‌పైకి వ‌చ్చింది. ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కె.క‌విత పింక్ బుక్ గురించి చెప్పారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కార్ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ నేత‌ల్ని, కార్య‌క‌ర్త‌ల్ని వేధించే వాళ్ల వివ‌రాల‌న్నీ పింక్‌బుక్‌లో రాసుకుంటున్న‌ట్టు ఆమె చెప్పారు. అధికారంలోకి రాగానే అంద‌రి క‌థ తేలుస్తామ‌ని ఆమె హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

అంబేద్క‌ర్ నేతృత్వంలో రాసిన రాజ్యాంగ పాల‌న పోయి, రాజ‌కీయ నాయ‌కులు రాసుకుంటున్న క‌క్ష‌పూరిత పుస్త‌కాల ప్ర‌కారం వ్య‌వ‌స్థ‌లు న‌డిచే ప‌రిస్థితి. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప్ర‌కారం పాల‌న సాగుతోంద‌ని వైసీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇవాళ మాజీ ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీ అరెస్ట్‌ను కూడా ఆ కోణంలోనే వైసీపీ చూస్తోంది. క‌క్ష‌తోనే వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు న‌మోదు చేశార‌ని ఆ పార్టీ నాయ‌కులు మండిప‌డుతున్నారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కార్ వ్య‌క్తిగ‌త క‌క్ష‌తో త‌మ‌వాళ్ల‌ను వేధిస్తున్న‌ట్టు బీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. త‌మ‌ను వేధించే వివిధ శాఖ‌ల ఉద్యోగులు, అలాగే అధికార పార్టీ నాయ‌కుల వివ‌రాల్ని పింక్‌బుక్‌లో రాసుకుంటున్నామ‌ని క‌విత చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అధికారంలోకి వ‌చ్చిన వాళ్లు అభివృద్ధి, అలాగే హామీల అమ‌లుపై కాకుండా, ప్ర‌త్య‌ర్థుల‌పై ప్ర‌తీకారం తీర్చుకునే రాజ‌కీయ విష సంస్కృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ధోర‌ణుల‌ను ప్ర‌జ‌లు ఛీత్క‌రించుకుంటున్నారు. కానీ పాల‌కుల్లో మార్పు రాక‌పోవ‌డం పౌర స‌మాజాన్ని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

16 Replies to “పింక్ బుక్‌లో రాసుకుంటున్నార‌ట‌!”

  1. జగన్ రెడ్డి, కేటీఆర్, కవిత, రోజా .. గతం లో లోకేష్ ని పప్పు అంటూ విమర్శించిన కొండెర్రిపప్పలే ఇవన్నీ..

    ఇప్పుడు అదే లోకేష్ ని ఆదర్శం గా తీసుకుని.. రాజకీయాలు చేస్తున్నారు..

    ..

    లోకేష్ మిమ్మల్ని మించి ఎదిగినట్టా..?

    లేక..

    మీరు లోకేష్ ని దాటి దిగజారిపోయినట్టా..?

    ..

    అధికారం మిమ్మల్ని నాశనం చేస్తే.. అదే అధికారం మమ్మల్ని ఉన్నతులను చేసింది..

Comments are closed.