కమల్​కు, చిరుకు ఒక్కటే తేడా!

2024 లోక్‌సభ ఎన్నికల్లో కమల్ హాసన్ ఇండియా కూటమికి తన మద్దతు తెలిపారు. అందుకు ప్రతిఫలంగానే కమల్​హాసన్​కు స్టాలిన్​ రాజ్యసభ సభ్యత్వం కట్టబెడుతోంది.

కమల్​హాసన్​, చిరంజీవి ఇద్దరు గొప్ప హీరోలే. ఇద్దరికీ ప్రేక్షకాదరణ విపరీతంగా ఉంది. ఇద్దరూ లెజెండ్సే. ఇద్దరికీ జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. ఇద్దరూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. సొంత పార్టీలు పెట్టారు. అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనుకున్నారు. కాని విఫలమయ్యారు.

ఇద్దరి మధ్య తేడా ఏమిటంటే.. ఆనాడు చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడయ్యారు. కేంద్రంలో మంత్రి పదవి పొందారు. ఇప్పుడు కమల్​హాసన్​ కూడా తన పార్టీ మక్కల్​ నీది మయ్యం పార్టీని తమిళనాడు అధికార పార్టీ డీఎంకేలో విలీనం చేయబోతున్నారు. డీఎంకే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతోంది.

ఇక ఇద్దరి మధ్య ఉన్న తేడా విషయానికొస్తే.. చిరంజీవి కేంద్రప్రభుత్వంలో మంత్రి పదవి పొందగా ఇప్పుడు కమల్​హాసన్​కు ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఆయన డీఎంకే నుండి రాజ్యసభకు వెళుతున్నాడు కాబట్టి. మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేతగా ఉన్న కమల్ హాసన్.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇండియా కూటమితో పొత్తు పెట్టుకున్నారు.

ఆ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పోటీకి దూరంగా ఉండేందుకు అంగీకరించిన కమల్ హాసన్.. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఇండియా కూటమి రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు డీఎంకే – ఎంఎన్‌ఎంల మధ్య కుదిరిన డీల్‌లో భాగంగా.. తమకు మద్దతు తెలిపిన కమల్‌ హాసన్‌కు ప్రతిఫలంగా రాజ్యసభ సీటు ఇస్తామని ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే 2025 జూన్‌లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో.. కమల్‌ హాసన్‌ను రాజ్యసభకు డీఎంకే నామినేట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సీఎం స్టాలిన్ హామీని కమల్‌ హాసన్‌కు తెలియజేసేందుకు శేఖర్ బాబు ఆయనను కలిసినట్టుగా తెలుస్తోంది. ఇక, 2018 ఫిబ్రవరిలో కమల్ హాసన్… ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. తన పార్టీని పారదర్శకత, పాలన సంస్కరణలు, ప్రాంతీయ సహకారాన్ని సమర్థించే వేదికగా పేర్కొన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పోటీ చేసిన నియోజకవర్గాలలో 3.72 శాతం ఓట్లను పొందింది. అయితే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. చెన్నై, కోయంబత్తూర్, మధురై వంటి పట్టణ కేంద్రాలలో ఎంఎన్‌ఎం మంచి ప్రదర్శన ఇచ్చింది. కొన్ని ప్రాంతాలలో లక్షకు పైగా ఓట్లను సాధించింది. అయితే గ్రామీణ నియోజకవర్గాలలో ఎంఎన్‌ఎంకు ఆదరణ లభించలేదు. ఎంఎన్‌ఎం పార్టీ అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎంఎన్‌ఎం.. ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది.

కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో కమల్ హాసన్ 1,728 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎంఎన్‌ఎం‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కమల్ హాసన్ ఇండియా కూటమికి తన మద్దతు తెలిపారు. అందుకు ప్రతిఫలంగానే కమల్​హాసన్​కు స్టాలిన్​ రాజ్యసభ సభ్యత్వం కట్టబెడుతోంది.

7 Replies to “కమల్​కు, చిరుకు ఒక్కటే తేడా!”

  1. గొప్ప వ్యక్తులు గొప్ప వ్యక్తులకు తెలుసని మేము నమ్ముతున్నాము! అందుకే మా రెఫరల్ క్యాంపెయిన్‌ని ప్రారంభించేందుకు మేము సంతోషిస్తున్నాము, ఇక్కడ మీరు అద్భుతమైన రివార్డ్‌లను పొందుతూ మా కమ్యూనిటీని అభివృద్ధి చేయడంలో మాకు సహాయపడగలరు.

    🔹 ఇది ఎలా పని చేస్తుంది:

    1️⃣ వేమన IT సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి స్నేహితుడు, సహోద్యోగి లేదా భాగస్వామిని సూచించండి.

    2️⃣ వారు చేరినప్పుడు మరియు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు, మీరు రివార్డ్ పొందుతారు!

    3️⃣ మీరు ఎంత ఎక్కువ రెఫర్ చేస్తే అంత ఎక్కువ సంపాదిస్తారు-అందరూ గెలుస్తారు!

    💡 ఎందుకు సూచించాలి?

    ✅ మా ప్రభావాన్ని విస్తరించడంలో సహాయపడండి

    ✅ సారూప్యత గల వ్యక్తులతో మా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయండి

    ✅ ప్రత్యేకమైన పెర్క్‌లు మరియు రివార్డ్‌లను పొందండి

Comments are closed.