అచ్చెన్నాయుడు ఎంత బాగా చెప్పాడో!

మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్ట్‌పై వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎంత బాగా చెప్పాడో అని నెటిజ‌న్లు అంటున్నారు.

మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్ట్‌పై వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎంత బాగా చెప్పాడో అని నెటిజ‌న్లు అంటున్నారు. దాడికి ప్ర‌తిదాడి మంచిది కాద‌నేది త‌మ అభిమ‌తంగా ఆయ‌న చెప్పారు. క‌క్ష‌పూరితంగా అస‌లు వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని ఆయ‌న అన‌డం విశేషం. గ‌న్న‌వ‌రంలో టీడీపీ కార్యాల‌యంపై దాడి, కేసు విచార‌ణ గురించి అంద‌రికీ తెలుస‌న్నారు.

కానీ టీడీపీ కార్యాల‌యంలో ప‌ని చేసే ఆప‌రేట‌ర్ ఫిర్యాదుతో త‌న‌కు సంబంధం లేద‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వ ప‌రిపాల‌న ఏ విధంగా సాగుతున్న‌దో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రెడ్‌బుక్ ప‌రిపాల‌న‌కు ప్ర‌జామోదం వుంద‌ని మంత్రి నారా లోకేశ్ ప‌లుమార్లు చెప్పిన సంగ‌తి తెలిసిందే. రెడ్‌బుక్ ఎందుకు రాశారు? అందులో ఎన్నిచాప్ట‌ర్లు ఇంత వ‌ర‌కూ పూర్త‌య్యాయో లోకేశ్ అప్పుడ‌ప్పుడు వివ‌రాలు వెల్ల‌డిస్తుంటారు.

అయితే అచ్చెన్నాయుడు విష‌యానికి వ‌స్తే, గ‌తంలో మాదిరి దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం లేదు. అచ్చెన్న‌కు త‌గిన ప్రాధాన్యం కూడా ద‌క్క‌డం లేద‌నే మాట వినిపిస్తోంది. వైసీపీ హ‌యాంలో అచ్చెన్న అవినీతికి పాల్ప‌డ్డారంటూ అరెస్ట్ చేశారు. కానీ అనారోగ్యం సాకుతో దాదాపు నెల‌కు పైగా ఆయ‌న ఆస్ప‌త్రిలోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ఆ త‌ర్వాత బెయిల్‌పై విడుద‌లైన అచ్చెన్నాయుడు… త‌మ ప్ర‌భుత్వం రాగానే హోంశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకుని ఒక్కొక్క‌రి అంతు చూస్తాన‌ని హెచ్చ‌రించారు. కాలం గ‌డిచేకొద్ది ఆయ‌న‌లో ఆవేశం త‌గ్గింది. అలాగే కూట‌మి ప్ర‌భుత్వంలో త‌న ప‌లుకుబ‌డి స‌న్న‌గిల్ల‌డంతో అచ్చెన్నాయుడు ఆచితూచి మాట్లాడుతున్నారు. అది కూడా మొక్కుబ‌డిగా మాట్లాడుతూ, ఉనికి చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

11 Replies to “అచ్చెన్నాయుడు ఎంత బాగా చెప్పాడో!”

  1. “అది కూడా మొక్కుబ‌డిగా మాట్లాడుతూ, ఉనికి చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది”…who expressed this opinion?..che ddi batch?

  2. ఆ రకంగా మిమ్మల్ని కొయ్యాలి అని హోం కావాలి అంటే ఒక్క అచ్చన్న ఏం ఖర్మ టీడీపీ లో మిమ్మల్ని కొయ్యటానికి మాత్రమే హోం అడిగే వాళ్లకి లెక్కే లేదు మరి. ఎంతసేపు టీడీపీ మీద పడి ఏడవటమేనా రెడ్డీ?

Comments are closed.