ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి గతంలో సారథ్యం వహించిన మాజీ మంత్రి శైలజానాధ్ కొన్ని రోజుల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజానికి వైసీపీకి ఈ తరుణంలో ఇది మంచి పరిణామం అని చెప్పాలి. దళిత నాయకుడు, మాజీ మంత్రి స్థాయి ఉన్న వ్యక్తి, పీసీసీ సారథ్యం వహించిన నేత వైసీపీలో చేరడం వారికి కొంత నైతిక స్థైర్యాన్నిస్తుంది. ఒకవైపు చాలా మంది నాయకులు వైసీపీ నుంచి బయటకు వెళుతుండగా, శైలజానాధ్ రావడం మంచి సంకేతమే.
అయితే, శైలజానాధ్ పార్టీలోకి వచ్చీ రాగానే కొత్త ఫిట్టింగ్‌లు పెడుతున్నారా? అనే అభిప్రాయాలు పలువురికి కలుగుతున్నాయి.
శైలజానాధ్ అనంతపురంలో ఇతర వైసీపీ నేతలతో కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. పలు విషయాలను చర్చించారు. అయితే, జగన్ కుటుంబంలో ఉన్న విభేదాల గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు, ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డిపై తమకు ఆరాధన భావం ఉందని, అన్నాచెల్లెళ్ల మధ్య ఇలాంటి పరిణామాలు ఉండకూడదని వైఎస్సార్ అభిమానులుగా బాధపడుతున్నట్లు చెప్పారు. ఈ పరిణామాలకు ఎక్కడో ఒకచోట ముగింపు ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంతటితో ఆగకుండా, వైఎస్ విజయమ్మ ఇంకా చురుగ్గా ఉన్నారని, ఆమె వైకాపా నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని ఆయన అనడం గమనార్హం. వైఎస్ కుటుంబంలోని తగాదాల్లో విజయమ్మ కూడా ఒక పాత్రధారిగా మారిపోయారు. సాధారణంగా తన కుటుంబ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుని సలహాలు చెప్పడం, పార్టీ నాయకత్వమే మారాలన్నట్లు సూచించడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టపడకపోవచ్చు.
అయితే, కొన్ని రోజుల కిందట పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన శైలజానాధ్… జగన్ పట్ల ఎంత విధేయత ప్రదర్శిస్తారో తెలియదు గానీ, ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని జగన్ సహిస్తారా? అనే చర్చ పార్టీలో జరుగుతోంది.
మొత్తానికి, శైలజానాధ్ పార్టీలోకి వచ్చీ రాగానే కొత్త ఫిట్టింగ్‌లు పెడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కొరివితో తలా గొకోవడం .. దారిని పోయే మూళ్ళ కంప ని అంటించుకోవడం .. పెద్ద వాళ్ళు ఊరకనే అన్నారు ..
మునిగే పోయే పార్టీ ఆమెకి అప్పగించి పారిపోవాలనే ప్లాన్ ఏమో
pichodi tho friendhsip..lets see how this journey goes
అసలు అందులో తప్పు ఏం ఉంది నువ్వు కోడిగుడ్డికి ఈకలు పీకడం తప్ప
అసలు అందులో తప్పు ఏం ఉంది నువ్వు—కోడిగుడ్డికి—ఈకలు—పీకడం—తప్ప
అసలు అందులో తప్పు ఏం ఉంది నువ్వు—కోడిగుడ్డికిఈకలు—పీకడం—తప్ప
అసలు అందులో తప్పు ఏం ఉంది నువ్వు—@@@@@@కోడిగుడ్డికిఈకలు@@@—పీకడం—తప్ప
ప్లే బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
బేసిక్‌గా మనకి మంచి వినపడదు, ఒన్లీ పోగడ్తలు (లైక్ సింగిల్ సింహం, 175/175, 30 ఇయర్స్ మనమే) బట్టి పట్టకుండా, యాక్టింగ్ లేకుండా ఒక్క ఐదు లైన్s మాట్లాడలేదు. GA నేను రియలైజ్ అయ్యాను, టీడీపీ మరియు జనసేనకి వేరే రెడ్డి అపోనెంట్‌ని వెతకడానికి ట్రై చేద్దాం.
Ayo
బాత్రూమ్ కి పోయేటప్పుడు జాగ్రత్త సుమా
Em gunde raa baabudi, kaani annani tattukoni maree kotuukuntadaa, naaku doubt e
11 సంవత్సరాల తరువాత వీడికి కష్ట కాలం మొదలైంది.
ఏరి కోరి కష్టాలను కొనితెచ్చుకొంటామంటే ఆ దేవుడు మాత్రం ఏమి చేయగలడు.
మిగతావారికంటే వాడికే బాగా తెలుసు జగన్ గురించి.
ఒక సారి KVP గారిని కలవకపోయారా పార్టీ జాయిన్ అయ్యే ముందు .
విజయమ్మ గారి సలహా కూడా తీసుకొని వుంటే ఇంకా బాగుండేది.!