వంశీ సెల్‌ఫోన్ దొరక్క‌పోవ‌డంతో!

సెల్‌ఫోన్ దొర‌క్క‌పోవ‌డంతో విజ‌య‌వాడ నుంచి వెళ్లిన పోలీస్ బృందం వెనుతిరిగింది. వంశీ సెల్‌ఫోన్ దొరికి వుంటే, అందులో ఎలాంటి ఆధారాలు వుండేవో తెలియ‌దు

మాజీ ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీ సెల్‌ఫోన్‌లో కేసుకు సంబంధించి కీల‌క ఆధారాలున్నాయ‌ని పోలీసుల న‌మ్మ‌కం. ద‌ళిత యువ‌కుడిని కిడ్నాప్ చేశార‌నే కార‌ణంతో వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. వంశీ సెల్‌ఫోన్‌లో ద‌ళిత యువ‌కుడికి ఫోన్ చేయ‌డంతో పాటు బెదిరింపు, ఇత‌ర‌త్రా ఆధారాలున్నాయ‌ని పోలీసులు చెబుతూ వచ్చారు.

అరెస్ట్ స‌మ‌యంలో ఆయ‌న సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకోలేదు. దీంతో సెల్‌ఫోన్ కోసం పోలీసులు హ‌డావుడిగా శ‌నివారం హైద‌రాబాద్‌లోని ఆయ‌న ఇంటికి వెళ్లారు. వంశీ సెల్‌ఫోన్ చివ‌రిసారిగా ఆయ‌న ఇంట్లోనే లొకేశ‌న్ చూప‌డంతో, దాని కోసం పోలీసుల బృందం వెళ్లింది. సుమారు రెండు గంట‌ల పాటు సెల్‌ఫోన్ కోసం వంశీ ఇంట్లో పోలీసులు వెతికారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం లేక‌పోయింది.

సెల్‌ఫోన్ దొర‌క్క‌పోవ‌డంతో విజ‌య‌వాడ నుంచి వెళ్లిన పోలీస్ బృందం వెనుతిరిగింది. వంశీ సెల్‌ఫోన్ దొరికి వుంటే, అందులో ఎలాంటి ఆధారాలు వుండేవో తెలియ‌దు. కానీ సెల్‌ఫోన్ దొర‌క్క‌పోవ‌డంతో కేసుకు బ‌ల‌మైన ఆధారాల్ని సేక‌రించ‌డం కొంచెం క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

ఒక‌వేళ వంశీ సెల్‌ఫోన్ ల‌భించ‌క‌పోతే, పోలీసుల ప్లాన్ బీ రెడీ చేసుకున్నారా? లేదా? అనేది తెలియాల్సి వుంది. వంశీ కేసులో మున్ముందు ఇంకెన్ని మ‌లుపులున్నాయో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.

8 Replies to “వంశీ సెల్‌ఫోన్ దొరక్క‌పోవ‌డంతో!”

  1. నువ్వెమి బాదపడకు. వాడి ఇంట్లొ CCTV ఫూటెజ్ కూడా సెకరించారు!

    జైల్లో వంశీ నాకు ఈ రూమ్ వద్దు అని అలిగాడు అంట చూస్కొ!!

    1. అత్తారింట్లో (j@il)అల్లుడు(ఖైది) అలగడం…కామనే లెండి…..దానికే వార్త రాసేస్తారా !!!!

  2. మా అన్నయ్య అధికారం లో ఉంటే ఈ తిప్పలు ఉండేవి కావు ఎదుటి వారికి ఉండేవి..ఆ ఎదుటి వారి మీద రాసే వారు మన జీఏ గారు

  3. మరింకేం ఇంకా ఎ బెంగ లేదు తప్పు చేయ లేని వాడయితే సెల్ఫోన్ పక్కకి ఎందుకు పడేస్తాడు ధైర్యంగా పోలీసు లకి ఇవ్వొచ్చు గా అయ్యా

Comments are closed.