మెగాస్టార్-యూవీ క్రియేషన్స్ కాంబినేషన్ సినిమా విశ్వంభర. ఈ సినిమా మే నెల విడుదల అని టాక్ ఉంది. కానీ జూన్ లేదా ఆ తర్వాత అన్నది గ్రౌండ్ రియాల్టీ అని టాలీవుడ్‌లో వినిపిస్తోంది.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక అప్‌డేట్ ఏమిటంటే, ఈ మెగాస్టార్ భారీ సినిమాలో మరో మెగా హీరో స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇది మొదటి నుంచీ అనుకున్నది కాదు. ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది.
సాయిధరమ్ తేజ్ గతంలో పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేశారు. ఇప్పుడు పెద్ద మేనమామ మెగాస్టార్ సినిమాలో చేస్తున్నారు. ఈ పాత్ర షూట్ మూడు రోజులు ఉంటుంది. షూట్ ఈ రోజు ప్రారంభమైంది.
రెండు పాటలు, కొద్ది ప్యాచ్‌వర్క్ మినహా సినిమా షూట్ మొత్తం పూర్తయినట్లే. కానీ సినిమాకు సీజీ వర్క్‌లు చాలా ఎక్కువ. అది కూడా కీలకమైన బ్లాక్‌లు ఉన్నాయి. అవి వచ్చి, వాటి క్వాలిటీ చూస్తే తప్ప ఎప్పుడు విడుదల అన్నది తెలియదు.
గతంలో టీజర్ విడుదల చేసినప్పుడే సీజీ వర్క్‌లు బాగా లేక భయంకరమైన ట్రోలింగ్ జరిగింది. అందుకే ఈసారి సీజీ వర్క్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు.
ప్లే బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Santha lo okaru
ayi payeeee …yethi pothala padhakame
Aaaathu
Waiting