ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్‌బుక్ అత్యంత చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న విమర్శల్ని ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్ లెక్కపెట్టడం లేదు. ఆ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, వెనక్కి తగ్గేదేలే అంటున్నారాయన. తాజాగా మరోసారి రెడ్‌బుక్‌పై లోకేశ్ తనదైన స్టైల్‌లో స్పందించారు.
యువగళం పాదయాత్రలో 90 సభల్లో రెడ్‌బుక్ గురించి చెప్పానన్నారు. వైసీపీ హయాంలో తమ వాళ్లను ఇబ్బంది పెట్టిన ఆ పార్టీ నాయకులు, అధికారుల్ని చట్టప్రకారం శిక్షిస్తామని తాను హామీ ఇచ్చానన్నారు. దానికి ప్రజలు కూడా ఆమోదం తెలిపినట్టు లోకేశ్ చెప్పుకొచ్చారు. అందుకే తామిప్పుడు తీసుకుంటున్న చర్యల్లో ఏ మాత్రం తప్పులేదని ఆయన మరోసారి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
వల్లభనేని వంశీ దళితుడిని కిడ్నాప్ చేసి, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించాడన్నారు. ఆ కేసులోనే వంశీ అరెస్ట్ అయ్యాడని లోకేశ్ తెలిపారు. రానున్న రోజుల్లో వంశీ అరాచకాలకు సంబంధించి అన్ని వివరాలు బయటికి వస్తాయని ఆయన చెప్పారు.
రెడ్‌బుక్ పాలనపై లోకేశ్ మరోసారి స్పష్టత ఇవ్వడం రాజకీయంగా లాభమా? నష్టమా? అనే చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు తాము చేసేవన్నీ సరైనవనే భ్రమలో వుండడం సహజం. లోకేశ్ కూడా అలాంటి భ్రమలోనే ఉన్నాడా? అంటే, కాదనలేం. అయితే ప్రతి ఐదేళ్లకో సారి ప్రజలు ఇచ్చే తీర్పే, మంచీచెడులను తేల్చేస్తుంది. అంత వరకూ ఓపిక పట్టాల్సిందే.
తల్లి పుటక మేనమాకెరుక. ఆ మాత్రం కోపం ఉంటుంది నీతి చంద్రికలో కథల
ఆ మాత్రం కోపం ఉంటుంది నీతి చంద్రికలో కథల
ప్లే బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
మీకు BOOK ఉంటే మావోడు “ఎర్రి book ” రాస్తున్నాడు
Kalam evari chethilo vundadhu…
ఆ ముక్క మీరు అధికారం లో ఉన్నప్పుడు కూడా చెప్పి ఉంటే .. ఇప్పుడు కాలం సహకరించేది..
మీ కాలం నడిచినంతకాలం.. మిడిమాలం గా ప్రవర్తించి.. ఇప్పుడు విదుర నీతి ప్రవచనాలు, బుద్ధ ప్రబోధాలు, వేమన శతకాలు చెప్పినా.. ప్రయోజనం ఉండదు.. విలువ కూడా ఉండదు..
తప్పదు అక్కాయ్…ఇప్పుడు వృద్ధ నారీ పతివ్రతా టైపు లో ఎందుకు సూక్తులు…ఇంకో నాలుగేళ్లు ఎంత లోకి కళ్ళుమూసుకోండి…ఇట్టే అయిపోతుంది….
Avuna
red book నినాదం తోనే 2024 ఎలక్షన్ కి వెళ్లారు, అఖండ మెజారిటీ తో ప్రజలు గెలిపించారు!! 100% ప్రజల మద్దతు ఉంది, ఇక పైన ఉంటుంది!! red book అంటే మన చట్టం రాజ్యాంగo చెప్పినట్లు తప్పు చేసిన వాడికి శిక్ష, వాడు ఎంతటి వాడైనా సరే!! next పెద్ద అవినీతి తిమింగలాలు వంతు!!