ఆ గ్లింప్స్.. ఈ గ్లింప్స్.. ఒకటే స్క్రీన్ ప్లే?

తొలి గ్లింప్స్ తయారీకి కాస్త భారీగానే ఖర్చయింది. ఏదైనా టైమ్ మీద వదిలేయాలి. లేదంటే ఇలాగే ఇబ్బంది అవుతుంది.

నిన్నటికి నిన్న వచ్చింది విజయ్ దేవరకొండ నటించే కింగ్ డమ్ సినిమా టీజర్. సరే, ఈ టీజర్ ఎలా వుంది. మంచి చెడ్డలు ఏమిటి అవన్నీ ఇప్పటికే అంతా ముచ్చటించేసుకున్నారు. కానీ అది కాదు విషయం. టాలీవుడ్ లో వైవిధ్య మైన సినిమాలు వెదికి వెదికి చేస్తూ, సక్సెస్ లు కొడుతూ పేరు తెచ్చుకుంటున్న యంగ్ హీరో చేయబోయే సినిమా ఒకటి వుంది. క్రేజీ కాంబినేషన్ ఇది. ఈ సినిమా నుంచి అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ఒకటి రావాల్సి వుంది.

కానీ రకరకాల కారణాల వల్ల అది అలా వెనక్కు వుండిపోయింది. త్వరలో వస్తుంది అని ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఆ గ్లింప్స్.. ఈ కింగ్ డమ్ గ్లింప్స్ ఒకటే స్క్రీన్ ప్లే అంట. గ్లింప్స్ కు స్క్రీన్ ప్లే ఏమిటీ అంటే.. ఒకటే లైనూ లెంగ్తూ అని మీనింగ్.

కింగ్ డమ్ టీజర్ ఎలా వుంటుంది. హీరో గురించి, సిట్యువేషన్ గురించి ఎలివేషన్లు, కొన్ని ఇంటస్ట్రింగ్ కట్ లు వేసుకుంటూ వెళ్లి, చివర్న హీరోని పరిచయం చేసి ఓ డైలాగు చెప్పించడం. ఆ సినిమా గ్లింప్స్ లైనూ లెంగ్తూ ఇదే విధంగా తయారయిందట. నిజానికి అది ఎప్పుడో చేసి వుంచింది.

అందుకే ఇప్పుడు ఆ గ్లింప్స్ ఇక వదలాలా? కొత్తది తయారు చేయాలా? అనే ఆలోచనల సాగుతున్నాయి. తొలి గ్లింప్స్ తయారీకి కాస్త భారీగానే ఖర్చయింది. ఏదైనా టైమ్ మీద వదిలేయాలి. లేదంటే ఇలాగే ఇబ్బంది అవుతుంది.

4 Replies to “ఆ గ్లింప్స్.. ఈ గ్లింప్స్.. ఒకటే స్క్రీన్ ప్లే?”

Comments are closed.