అతడికి సరెండర్ అయిపోయా – రష్మిక

ఛావాలో నాకు దొరికిన పాత్ర సాధారణమైంది కాదు, చారిత్రక నేపథ్యం ఉన్న పాత్ర అది. పైగా నాకు హిందీ రాదు. దీంతో పూర్తిగా దర్శకుడికి సరెండర్ అయిపోయాను.

ఛాలెంజింగ్ రోల్స్ చేయడం హీరోహీరోయిన్లకు అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు ఈ విషయం చాలా కష్టం. ఎందుకంటే, వాళ్లకు దొరికేదే నూటికొక మంచి పాత్ర. అలాంటి క్యారెక్టర్లు దొరికినప్పుడు రిజెక్ట్ చేయకూడదని, పూర్తిగా దర్శకుడు చెప్పినట్టు చేయాలని అంటోంది రష్మిక.

“ఛావాలో నాకు దొరికిన పాత్ర సాధారణమైంది కాదు, చారిత్రక నేపథ్యం ఉన్న పాత్ర అది. పైగా నాకు హిందీ రాదు. దీంతో పూర్తిగా దర్శకుడికి సరెండర్ అయిపోయాను. ఆయన చెప్పినట్టు చేశాను. నా పాత్ర ప్రేక్షకులకు నచ్చితే ఆ క్రెడిట్ పూర్తిగా దర్శకుడికే ఇస్తాను.”

ఇలా కష్టమైన పాత్రలు దొరికినప్పుడు దర్శకుడికి సరెండర్ అయిపోవడం బెటర్ అంటూ సలహా ఇస్తోంది రష్మిక. ఇందులో ఆమె చారిత్రక ఏసుబాయి పాత్ర పోషించింది.

ఈ పాత్ర కోసం ఒరిజినల్ బంగారు నగలు వాడారంట. కిలోల కొద్దీ బంగారు నగలు ధరించి, బరువైన చీరలు కట్టుకొని నటించడం ఛాలెంజింగ్ అనిపించిందట. ఒక్కసారి మేకప్ పూర్తయిన తర్వాత బాత్రూమ్ కు వెళ్లినా మొత్తం పాడైపోతుందని, అందుకే మేకప్ అయిన తర్వాత మంచి నీళ్లు కూడా తాగకుండా షూటింగ్ చేశానంటోంది రష్మిక.

2 Replies to “అతడికి సరెండర్ అయిపోయా – రష్మిక”

Comments are closed.