వైసీపీపై నింద‌ల‌తో ఇంకెన్నాళ్లు బ‌తుకుతారు?

ఇష్టానురీతిలో అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. వైసీపీపై నింద‌లు వేస్తూ కూట‌మి నేత‌లు ఇంకెంత కాలం బ‌తుకుతార‌ని ఆయ‌న నిల‌దీశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తి స‌మ‌స్య‌కు గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌నే కార‌ణ‌మ‌ని ఆరోపించ‌డం కూట‌మినేత‌ల‌కు అల‌వాటైంది. కూట‌మి నేత‌ల విమ‌ర్శ‌ల‌కు మించి, అనుకూల మీడియా రాత‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కూట‌మికి రాజ‌కీయంగా న‌ష్టం వ‌స్తుంద‌ని భావిస్తే, మీడియా సెన్సార్ విధిస్తోంది. అయితే సోష‌ల్ మీడియా బ‌లంగా వుండ‌డంతో ఏదీ దాగ‌డం లేదు.

వైసీపీ పాల‌న‌లో మంచి ప‌నులేవీ జ‌ర‌గ‌లేద‌ని ప‌దేప‌దే చెప్ప‌డం ద్వారా, ఆ పార్టీ అంటే భ‌యాన్ని సృష్టించ‌డ‌మే ఏకైక ఎజెండాతో ప‌ని చేస్తున్నారు. ఇదే కూట‌మి ప్ర‌భుత్వంలో జ‌మ్మ‌ల‌మ‌డుగు, ఆళ్ల‌గ‌డ్డ‌, అలాగే ఉత్త‌రాంధ్ర‌లో కాంట్రాక్ట‌ర్లు, పారిశ్రామిక సంస్థ‌ల‌పై దాడుల్ని లోకానికి తెలియ‌కుండా క‌ప్పి పుచ్చే ప్ర‌య‌త్నాన్ని చూశాం. సామాన్యులు కూడా కూట‌మి నేత‌ల దాడుల‌కు గురి అవుతున్నారు. మ‌రీ ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన సామాన్య కార్య‌క‌ర్త‌లు కూడా ప్ర‌భుత్వ పెద్ద‌ల దౌర్జ‌న్యాల‌కు గురి అవుతున్నారు.

ఇక ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు న‌డుచుకునే పోలీస్ యంత్రాంగం. కేసుల న‌మోదుకు త‌ప్పొప్పుల‌తో సంబంధం లేద‌నే అభిప్రాయం స‌మాజానికి క‌లుగుతోంది. రెడ్‌బుక్‌లో న‌మోదు చేసుకున్న ప్ర‌కారం అధికారులు, వైసీపీ నేత‌లు ప్ర‌భుత్వానికి టార్గెట్ అయ్యారు. ఇందులో భాగంగా కొంద‌రు ఉన్న‌తాధికారులు తొమ్మిది నెల‌లుగా పోస్టింగ్‌ల‌కు కూడా నోచుకోలేదు. అలాగే ముంబ‌య్ న‌టి కాదంబ‌రి జెత్వాని, తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ బాధితురాలు ల‌క్ష్మి వ్య‌వ‌హారంలో పోలీసుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

అధికారం అండ‌గా వుంటే, బాధితుల‌పైనే కేసులు న‌మోదు చేయొచ్చ‌ని ఇప్పుడే కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. చివ‌రికి ఏపీ హైకోర్టు రాష్ట్ర పోలీస్ యంత్రాంగంపై తీవ్ర ఆగ్ర‌హం చేసే ప‌రిస్థితి. ఇలాగైతే డీజీపీని కోర్టుకు పిలిపించాల్సి వ‌స్తుంద‌ని న్యాయ స్థానం మండిప‌డింది.

ఈ నేప‌థ్యంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్ట్‌పై వైసీపీ నేత‌లు ఫైర్ అవుతున్నారు. ఇది ముమ్మాటికీ క‌క్ష‌పూరిత చ‌ర్య అని వైసీపీ సీనియ‌ర్ నేత‌లు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి విమ‌ర్శించారు. విశాఖ‌లో బొత్స మీడియాతో మాట్లాడుతూ కూట‌మి పాల‌న‌లో ఏ త‌ప్పు జ‌రిగినా తమ పార్టీపై నెట్టేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇష్టానురీతిలో అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. వైసీపీపై నింద‌లు వేస్తూ కూట‌మి నేత‌లు ఇంకెంత కాలం బ‌తుకుతార‌ని ఆయ‌న నిల‌దీశారు.

16 Replies to “వైసీపీపై నింద‌ల‌తో ఇంకెన్నాళ్లు బ‌తుకుతారు?”

  1. మనం చేసింది “పాపాల పాలన” అని ప్రజలకి తెలిసే “పంగనామాల mandate” ఇచ్చి confirm చేశారు. కొత్తగా టీడీపీ ఆరోపించేది ఏముంది ఇందులో??

  2. ఏమిటి డీజీపీ ని పిలుస్తామని కోర్ట్ హేట్చరించిందనా?గత ప్రభుత్వం లో ఇలా డీజీపీ, చీఫ్ సెక్రటరీ వంద సార్లు పైగా కోర్ట్ లో హాజరు అయిన సంగతి గుర్తులేదా?

  3. మన అన్న ప్రభుత్వం లో కోర్ట్ ని బేఖాతరు చేసినందుకు గోపాల కృష్ణ ద్వివేదీ కోర్ట్ లో ఫైన్ కట్టిన విషయం గుర్తు లేదా?

  4. ఏమిటి బాధితులపైనే కేసు పెట్టారా? అవునా అమరావతి దళిత రైతుల పైనే SC,ST కేసు పెట్టిన విషయం మరిచావా?

  5. ఏమిటి బాధితులపైనే కేసు పెట్టారా? అవునా అమరావతి దళి త రైతుల పైనే s c , s t కేసు పెట్టిన విషయం మరిచావాగా?

  6. పాపం.. న్యూట్రల్ జ ర్నలిష్టు .. వెంకట్ రెడ్డి.. హర్ట్ అయినట్టున్నాడు..

    1. ఎందుకు దిగులు వీళ్ళకి వీరుడు సూరుడు ధీరుడు పొన్నవోలు ఉన్నప్పుడు ..

  7. “ముంబ‌య్ న‌టి కాదంబ‌రి జెత్వాని, తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ బాధితురాలు ల‌క్ష్మి వ్య‌వ‌హారంలో పోలీసుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు”….who are those people?

    che ddi batch?

  8. గతం లో ఖాకీ పెద్ద అనే పదవి ప్యాలస్ కులగజ్జి కట్టు బానిస కి ఇచ్చారు, అతను ప్యాలస్ పులకేశి చెప్పిన ప్రతి పని , కులగజ్జి తో కసిగా చేసేవాడు.

    ఇది కొంతవరకు ఒకే, సిఎం చెబితే యే అధికారులు అయిన చెయ్యాలి, మరీ చట్ట పరిధి దాటనంత వరకు.

    కానీ,

    చివరికి నేరస్తుల వేలిముద్ర లు వుండే కంప్యూటర్ లు పనిచేయకుండా కూడా చేశాడు, ప్యాలస్ పులకేశి వేలిముద్రలు వున్నాయి అని.

    ఇది వృత్తి ధర్మానికి వ్యతిరేకం అయిన పని. ఇలాంటివి మాత్రం చెయ్యకూడదు.

    అప్పుడు గ్రేట్ ఆంద్ర వెనకటి రెడ్డి గారికి తోటి కుల గజ్జి వలన అప్పట్లో ఇలాంటి నీతి సూత్రాలు చెప్పడం మరిచిపోయారు.

  9. అప్పట్లో కాస్త మంచి అధికారిగా పెరువున్న ఐపీఎస్ నీ కూడా ఒక హీరోయిన్ అక్రమ అరెస్టు లో దొరికిపోయి అతని కెరీర్ చంక నాకిపోయింది.

    ప్యాలస్ పులకేశి విసిరేసిన బిచ్చం కోసం పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ లు అందరూ “నేను ప్యాలస్ పులకేశి కి బానిస ను” అనే ముద్ర నుదుటి మీద పచ్చ బొట్టు వేసుకుని తిరుగుతున్నారు .

Comments are closed.