‘దేశం’ పాలనపై అవినీతి మరక-పవన్

నమ్మకం అయితే పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా. తెలుగుదేశం పార్టీ మీద కూడా. ఏ వనరులు లేని రాష్ట్రం మీద విపరీతమైన కరెప్షన్ అని ఓ ఏజెన్సీ చెప్పే స్థాయికి, సర్టిఫై చేయడం…

నమ్మకం అయితే పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా. తెలుగుదేశం పార్టీ మీద కూడా. ఏ వనరులు లేని రాష్ట్రం మీద విపరీతమైన కరెప్షన్ అని ఓ ఏజెన్సీ చెప్పే స్థాయికి, సర్టిఫై చేయడం చాలా బాధాకరంగా వుంది. అసలు ఫండ్స్ ఎంత వచ్చాయి. అవి దేనికి వెళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదంటున్నారు. లోపం అయితే వుంది. అబద్ధాలు అయితే వున్నాయి.

''..ఈ మభ్య పెట్టే రాజకీయాలు మాత్రం డేంజర్. ఇది గమనించాలి..''

ఈరోజు ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ అన్నమాటలు ఇవి. ఇన్నాళ్లుగా భాజపా నాయకులు కొందరు. వైకాపా నేతలు గోల పెడుతుందన్నది ఇదే కదా? కాదని ప్రతిపక్షం గొంతు వినపడకుండా మన ఘనత వహించిన మీడియా మాయచేస్తూ వచ్చింది నిజం కాదా? ఇప్పుడు పవన్ కూడా ఇదే విధంగా తన గొంతు విప్పారు. ఇప్పుడు కూడా మన మీడియా మాయ చేయడం గ్యారంటీ. పవన్ స్పీచ్ లోంచి ఈమాటలు ఒమిట్ చేసి, ప్రెజెంట్ చేసే అవకాశమే ఎక్కువ.

పైగా పవన్ కూడా ఇప్పుడు ఇలా అన్నారు కానీ రేపు ఏం అంటారో తెలియదు. ఎందుకంటే ఏ రోటి దగ్గర ఆ పాట పాడుతున్నారు పవన్. తెలంగాణలో సూపర్ పోరాటం అంటారు. ఆంధ్రలో అన్యాయం జరిగిపోయింది అంటారు. అందువల్ల ఈరోజు మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని రేపు ప్రస్తావించకపోవచ్చు.