మహేష్ తో సినిమాకు కథలేదు

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేయాల్సిన చాన్స్ వస్తే, కథలేదని వదులుకుంటారా? ఎవరైనా? కానీ టాప్ డైరక్టర్ వివి వినాయక్ అలాగే అంటున్నారు. ఆయన మహేష్ బాబుతో ఎప్పటి నుంచో…

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేయాల్సిన చాన్స్ వస్తే, కథలేదని వదులుకుంటారా? ఎవరైనా? కానీ టాప్ డైరక్టర్ వివి వినాయక్ అలాగే అంటున్నారు. ఆయన మహేష్ బాబుతో ఎప్పటి నుంచో సినిమా చేస్తారని వార్తలు వున్నాయి.

కానీ అదే జరగడం లేదు. అదేమని అడిగితే, మహేష్ కు నచ్చే, నప్పే కథ దొరకడం లేదు అంటున్నారు. సరైన కథ దొరకడం లేదు అంటున్నారు. పోనీ మీరే ఒక మాంచి కథ తయారుచేయవచ్చు కదా? అంటే చూద్దాం వచ్చే ఏడాది అంటున్నారు వినాయక్.

ఆకుల శివను దాటి రాలేకపోతున్నారు. వేరే వాళ్ల కథలు నచ్చడం లేదు అని వినిపిస్తున్న కామెంట్లను వినాయక్ దృష్టికి తీసుకువస్తే, అదేం లేదని, ఆకుల శివ కాంబినేషన్ లో మూడే సినిమాలు చేసానని, ఆ మూడూ హిట్ లే అని అన్నారు. వేరే వాళ్లు తమ కథల్లో సత్తాలేకపోతే ఇలాంటి కామెంట్ లు చేస్తారని అన్నారు.

రాజకీయాల్లోకి వెళ్తానో, వెళ్లనో చెప్పలేనని, ఇప్పటికైతే ఆ ఆలోచన లేదని అన్నారు. అలా అని వెళ్లను అని కచ్చితంగా చెప్పలేనని, భవిష్యత్ లో ఏం జరుగుతుందో తానెలా చెబుతానని దాటవేసారు.

తాను ఎప్పుడూ చేస్తున్న సినిమా గురించే ఆలోచిస్తా అని, ఈసినిమా తరువాత ఏ సినిమా చేస్తానో అన్న ఆలోచనే వుండదని, చాలామంది నిర్మాతలకు ఇచ్చిన కమిట్ మెంట్ మేరకు సినిమాలు అయితే చాలా చేయాల్సి వుందని వినాయక్ అన్నారు.