తెలుగులో సక్సెస్ ఫుల్ డైరక్టర్లలో వివి వినాయక్ ఒకరు. దాదాపు ఎక్కువ శాతం హిట్ లే ఆయనవి. అలాంటి డైరక్టర్ సాయిధరమ్ లాంటి యాక్టివ్ యంగ్ హీరోతో సినిమా అంటే కాస్త ఆసక్తిగానే వుంటుంది. అయితే ఆ ఆసక్తి రాను రాను సినిమా పూర్తయ్యి, విడుదలకు దగ్గరవుతుంటే తగ్గుతూ వస్తోంది.
ఇంటిలిజెంట్ టీజర్ బయటకు వచ్చి, సినిమాకు కాస్త డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. వినాయక్ లాంటి సీనియర్ ఇంకా, ఎక్స్ పెర్ట్ డైరక్టర్ సరైన టీజర్ కట్ చేయలేకపోయారన్న టాక్ వినిపించింది. సరే, ట్రయిలర్ వస్తుంది కదా అని జనం సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ట్రయిలర్ వచ్చింది. అది కూడా నిరాశగానే వుంది.
రెగ్యులర్ కమర్షియల్ తాళింపులు తప్ప, కొత్తదనం అన్నది కలికంలోకి కూడా కనిపించలేదు. వినాయక్ తనకు అచ్చి వచ్చిన ఫార్మాట్ లో తు. చ తప్పకుండా ముందుకు వెళ్లినట్లు కనిపిస్తోంది. అలా వెళ్లినా కూడా వినాయక్ స్టయిల్ హెవీ ఎమోషన్ సీన్లలో ఎక్కడా కనిపించలేదు. కేవలం బి, సి సెంటర్ల ఆడియన్స్ ను నమ్ముకుని సినిమా చేసినట్లు కనిపిస్తోంది.