నెలకో మెగా సినిమా

దాదాపు డజను మంది మెగాక్యాంప్ హీరోలు తయారయ్యారు. ఓ క్రికెట్ టీమ్ నే అనే సైటైర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ మాటకు ఏమొచ్చే కానీ, నెలకో మెగా సినిమా మాత్రం జనాల ముందుకు వస్తున్నట్లు…

దాదాపు డజను మంది మెగాక్యాంప్ హీరోలు తయారయ్యారు. ఓ క్రికెట్ టీమ్ నే అనే సైటైర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ మాటకు ఏమొచ్చే కానీ, నెలకో మెగా సినిమా మాత్రం జనాల ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది.

డిసెంబర్ లో అల్లు శిరీష్ ఒక్క క్షణం అంటూ వచ్చాడు. జనవరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బోణీ కొట్టారు. అజ్ఞాతవాసి సినిమాను అందించారు. ఫిబ్రవరిలో రెండు మెగాసినిమాలు వరుసగా వస్తున్నాయి.

సాయి ధరమ్, వరుణ్ తేజ తమ అృదష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ వెంటనే మార్చిలో రామ్ చరణ్-సుకుమార్ సినిమా రాబోతోంది. ఏప్రియల్ ను బన్నీ ముందుగానే బుక్ చేసేసుకున్నాడు. అక్కడికి అరడజను సినిమాలతో ఒక రౌండ్ పూర్తయిపోతుంది.

అన్నీ పెర్ ఫెక్ట్ గా సెట్ అయిపోతే, మెగా అల్లుడి సినిమా మూడు నెలల్లో రెడీ అయిపోతుంది. అందువల్ల పోస్ట్ సమ్మర్ నాటికి ఆ సినిమా విడుదలకు రెడీ అయిపోతుంది. ఇక అక్కడి నుంచి మళ్లీ సెకెండ్ రౌండ్ స్టార్ట్ కావాలి. దసరా వేళకు రామ్ చరణ్-బోయపాటి సినిమా ప్లాన్ చేస్తున్నారు.

కానీ మిగిలిన హీరోల సినిమాలు ఏవీ ఇంకా ప్లానింగ్ లో లేవు. బన్నీ, శిరీష్, సాయి ధరమ్, పవన్, ఇలా ఎవ్వరి సినిమాలు సెట్ మీద లేవు. లేదూ అంటే నెలకు ఓ సినిమా వంతున 12సినిమాలు వుండి వుండేవి.