బయోపిక్ లా? బాలల సినిమాలా?

సావిత్రి, ఎన్టీఆర్ రెండు బయోపిక్ లు నిర్మాణంలో వున్నాయి. వీటిలో సావిత్రి చాలా వరకు రెడీ అయిపోయింది. ఎన్టీఆర్ బయోపిక్ స్టార్ట్ కావాలి. ఇవి కాక వైఎస్ఆర్ బయోపిక్ కూడా ఆలోచనలో వుంది. Advertisement…

సావిత్రి, ఎన్టీఆర్ రెండు బయోపిక్ లు నిర్మాణంలో వున్నాయి. వీటిలో సావిత్రి చాలా వరకు రెడీ అయిపోయింది. ఎన్టీఆర్ బయోపిక్ స్టార్ట్ కావాలి. ఇవి కాక వైఎస్ఆర్ బయోపిక్ కూడా ఆలోచనలో వుంది.

బయోపిక్ లు ప్లాన్ చేయడం వరకు ఒకె. వాటికి తగిన నటులు రావడం వరకే సమస్య. పాత్రలకు సరిపడా జనాలను ఎక్కడి నుంచి అయినా పట్టుకురావడానికి అందరికీ రామ్ గోపాల్ వర్మకు వున్న టాలెంట్ వుండదు. పైగా కొంతమంది సూట్ అవుతారని తెలిసినా ఓకె అనరు. దీంతో ఎవరో ఒకర్ని తీసుకుని మేకప్ వేస్తే, బాలభారతంలో పిల్లలను పెద్ద క్యారెక్టర్లకు తీసుకున్నట్లు వుంటుంది.

సావిత్రి సినిమాలో ఎన్టీఆర్-ఎఎన్నార్ పాత్రలకు ఎవరూ దొరకడం లేదు. ఎన్టీఆర్, నాగ చైతన్య ససేమిరా అనేసారు. నానిని ఎన్టీఆర్ పాత్రకు అనుకుంటున్నారని వార్తలు వినవచ్చాయి. ఎన్టీఆర్, ఆయన పర్సనాలిటీ ఎక్కడ? నాని ఎక్కడ? పైగా ఎన్టీఆర్ అంటే తెలియని తెలుగు వాడు వున్నాడా? నానికి ఎంత మేకప్ వేసినా ఎన్టీఆర్ ను మరిపించగలరా? ఇక నాగేశ్వరరావు క్యారెక్టర్ వుండనే వుంది. అలాగే బాలయ్య తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ వుంది. దీనికి కూడా నాగేశ్వరరావు క్యారెక్టర్ కావాలి. 

బాగా ఇంటింటా ఫెమిలియర్ అయిపోయిన క్యారెక్టర్లకు నటులను తీసుకురావడం అంటే అంత చిన్న విషయం కాదు. వైఎస్ఆర్ బయోపిక్ కు కూడా అదే సమస్య. వైఎస్ఆర్ లెవెల్ పర్సనాలిటీ, ఫేస్ లో ఆ గ్లో వున్న ఆర్టిస్ట్ దొరకాలి.

అలా కాదు, మేకప్ వేసేస్తాం, కాస్త పర్సనాలిటీ వుంటే చాలు అనుకుంటే, బాలభారతం, రామాయణం సినిమా మాదిరిగా తయారవుతుంది. చిన్నపిల్లలకు రాముడు, కృష్ణుడు, కంసుడు వేషాలు వేసినట్లు.