ఆమెకి అల్లు అర్జున్‌ అయినా బ్రేకిస్తాడా?

అజ్ఞాతవాసిపై చాలా ఆశలు పెట్టుకున్న అను ఎమాన్యుయేల్‌కి చుక్కెదురైంది. ఆ చిత్రం పెద్ద ఫ్లాప్‌ అవడమే కాకుండా హీరోయిన్లకి నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ తెచ్చిపెట్టింది. త్రివిక్రమ్‌ టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌గా తీసుకోవడంతో ఈ చిత్రం అందరికీ…

అజ్ఞాతవాసిపై చాలా ఆశలు పెట్టుకున్న అను ఎమాన్యుయేల్‌కి చుక్కెదురైంది. ఆ చిత్రం పెద్ద ఫ్లాప్‌ అవడమే కాకుండా హీరోయిన్లకి నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ తెచ్చిపెట్టింది. త్రివిక్రమ్‌ టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌గా తీసుకోవడంతో ఈ చిత్రం అందరికీ చెడ్డ పేరే తెచ్చింది.

అయితే మిగతా వారి మాట ఎలా వున్నా కానీ ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న నటి అనుకి మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే లక్కీగా ఆమె చేతిలో మరో పెద్ద సినిమా వుంది. అల్లు అర్జున్‌తో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రంలో కథానాయికగా నటిస్తోన్న అను ఎమాన్యుయేల్‌ ఇప్పుడు ఆ చిత్రం మీదే ఆశలన్నీ పెట్టుకుంది.

ఇది సీరియస్‌ సినిమాలా కనిపిస్తున్నప్పటికీ హీరోయిన్‌ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌ బాగానే వుంటుందట. ఇది మంచి హిట్‌ అయితే ఇక అనుకి వరుసగా భారీ సినిమాల్లో అవకాశాలొస్తాయి.

ఇప్పటికే ఆక్సిజన్‌, అజ్ఞాతవాసి చిత్రాలతో ఫ్లాప్‌ హీరోయిన్‌గా ముద్ర పడ్డ అను ఎమాన్యుయేల్‌కి మరో ఫ్లాప్‌ వస్తే ఐరెన్‌లెగ్‌ ముద్ర వేసేయడానికి మీడియా సిద్ధంగా వుంటుంది. బన్నీ సినిమాలు మినిమం గ్యారెంటీ వుంటాయి కనుక ఆమె ఫ్యూచర్‌ని డిసైడ్‌ చేసే చిత్రం ఇదే అవుతుంది.