ఇంత అందంగా వుందేంటి?

తొలిప్రేమ. ఈ టైటిల్ కు వున్న క్రేజ్ ఇంతా అంతా కాదు. పవర్ స్టార్ పవన్ కు పెద్ద క్రేజ్ తెచ్చిన సినిమా ఇది. ఇప్పుడు అదే టైటిల్ లో వరుణ్ తేజ్ సినిమా…

తొలిప్రేమ. ఈ టైటిల్ కు వున్న క్రేజ్ ఇంతా అంతా కాదు. పవర్ స్టార్ పవన్ కు పెద్ద క్రేజ్ తెచ్చిన సినిమా ఇది. ఇప్పుడు అదే టైటిల్ లో వరుణ్ తేజ్ సినిమా చేస్తుంటే, ఏదో క్రేజ్ రప్పించడం కోసం టైటిల్ పెట్టుకున్నాడేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు వచ్చిన ట్రయిలర్ చూస్తుంటే, కాదు ఇంతో అంతో విషయం వున్నట్లే వుంది అనిపిస్తోంది.

ట్రయిలర్ లో మూడు విషయాలు ముచ్చటించుకునేలా వున్నాయి. ఒకటి వరుణ్ తేజ్, రాశీఖన్నాల మూడు డిఫరెంట్ గెటప్ లు, సినిమా విజువల్స్, కాస్త హార్ట్ టచ్ చేసే ప్రయత్నం చేసిన సీన్లు. కథ బహుశా మూడు స్టేజ్ ల్లో జరుగుతుందేమో? అందుకు తగినట్లుగా రాశీఖన్నాను భలే మార్చారు. అలాగే వరుణ్ గెటప్ ఒకటి భలేగా వుంది. రొమాంటిక్ లవ్ స్టోరీకి కావాల్సింది మాంచి విజువల్స్. ఆ గ్రాండ్ నెస్ ట్రయిలర్ లో క్లియర్ గా కనిపిస్తోంది.

ఇక సినిమాకు కావాల్సింది బలమైన కథ, కథనాలు. అవి ఇప్పుడే తెలియవు కదా? కొత్త దర్శకుడు వెంకీ ట్రయిలర్ లో చూపించిన శాంపిల్ అయితే బాగానే వుంది. అందువల్ల ట్రయిలర్ తో తొలి ప్రేమ మీద హొప్ పెంచారనే చెప్పుకోవాలి.