ఎన్టీఆర్ బయోపిక్-ఓపెనింగ్ ఇందిరపై?

ఎన్టీఆర్ బయోపిక్ అనగానే ఓపెనింగ్ సీన్ ఎవరి మీద వుంటుదని అనుకుంటాం? ఎన్టీఆర్ మీదే కదా? కానీ కాదట. సినిమా ముందు నుంచి వెనక్కు వెళ్లి, క్లయిమాక్స్ లో మళ్లీ చైతన్య రథం నుంచి…

ఎన్టీఆర్ బయోపిక్ అనగానే ఓపెనింగ్ సీన్ ఎవరి మీద వుంటుదని అనుకుంటాం? ఎన్టీఆర్ మీదే కదా? కానీ కాదట. సినిమా ముందు నుంచి వెనక్కు వెళ్లి, క్లయిమాక్స్ లో మళ్లీ చైతన్య రథం నుంచి అధికార సింహాసనం మీదకు మారే అన్నగారి కథలా వుంటుందని తెలుస్తోంది.

సినిమా ఓపెనింగ్ లో అప్పటి కాంగ్రెస్ నేత ఇందిరా గాంధీ హైదరాబాద్ పర్యటనకు రావడం, రాష్ట్రంలో ఎన్టీఆర్ ర్యాలీలు, ఆ కోలాహలం గమనించి, ఏం జరుగుతోందని ప్రశ్నించడం, దానికి సమాధానంగా కాంగ్రెస్ నాయకులు ఓ సినిమా హీరో పార్టీ పెట్టారని చెప్పడం వంటి దృశ్యాలు వుంటాయట. 

టోటల్ గా ఇందిరాగాంధీ సీన్లు అన్నీ కలిపి, ఆమె కనిపించేది రెండు నిమషాలు మాత్రమే వుంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ పాత్రకు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. 
వాటిలో నదియా పేరు ఒకటి. ఆమె అయితే పెర్ ఫెక్ట్ గా సూట్ అవతుందని టాక్ వినిపిస్తోంది. అయితే కొత్తగా ఎవరినన్నా, అచ్చంగా ఇందిరి మాదిరిగా కనిపించే వారి కోసం కూడా దర్శకుడు తేజ అన్వేషిస్తున్నారట.

అయినా ఇంకా కనీసం నాలుగయిదు నెలలు టైమ్ వుందిగా. ఏం చేస్తారో చూడాలి.