అనుకు ఇక నో చాన్స్

అను ఎమాన్యుయేల్‌. పవన్ పక్కన నటించే చాన్స్ రావడంతో ఒక్కసారిగా పేరు మోత మోగిపోయింది. అంతే కాదు, ఇంకా అనేకానేక గ్యాసిప్ లు కూడా వినిపించాయిు. అనును హారిక హాసినిలోనే నాగ చైతన్య పక్కన…

అను ఎమాన్యుయేల్‌. పవన్ పక్కన నటించే చాన్స్ రావడంతో ఒక్కసారిగా పేరు మోత మోగిపోయింది. అంతే కాదు, ఇంకా అనేకానేక గ్యాసిప్ లు కూడా వినిపించాయిు. అనును హారిక హాసినిలోనే నాగ చైతన్య పక్కన హీరోయిన్ గా త్రివిక్రమ్ నే సిఫార్సు చేసారనీ వార్తలు వినిపించాయి.

ఆ లెక్కన ఎన్టీఆర్ సినిమాలో కూడా అను నటించే చాన్స్ వుంటుందని అనుకున్నారంతా. కానీ అజ్ఞాతవాసి ఫలితం రివర్స్ కావడంతో ఇప్పడు అను పేరు పక్కకుపోయిందట.

ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా అను ఎమాన్యుయేల్‌ పేరు ఇక ఎంత మాత్రం పరిశీలనలో లేదట. పూజా హెగ్డేతో సహా మరో మూడునాలుగు పేర్లు డిస్కషన్ లో వున్నాయట. కానీ అను పేరు మాత్రం లేదట.

టాలీవుడ్ లో అంతే. సక్సెస్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది ఇక్కడ.