భారీ పంక్షన్ కు నాని సన్నాహాలు

అ! సినిమాకు విభిన్నంగా ప్రచారం చేయాలని, వీలయినంత బజ్ రాబట్టాలని నిర్మాణ భాగస్వామి, హీరో నాని ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి 2న విడుదల చేసే ఉద్దేశంతా ముందుగా వైవిధ్యంగా ప్రచారం స్టార్ట్ చేసారు. కానీ చాలా…

అ! సినిమాకు విభిన్నంగా ప్రచారం చేయాలని, వీలయినంత బజ్ రాబట్టాలని నిర్మాణ భాగస్వామి, హీరో నాని ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి 2న విడుదల చేసే ఉద్దేశంతా ముందుగా వైవిధ్యంగా ప్రచారం స్టార్ట్ చేసారు. కానీ చాలా సినిమాలు ముందువారం, ఆ తరువాతి వారం వుండడంతో, వాయిదా వేయక తప్పలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఫిబ్రవరి 16డేట్ ప్రకటించారు.

అయితే సినిమాకు ఆ లోగానే క్రేజ్ పెంచేందుకు నాని కసరత్తు స్టార్ట్ చేసారు. ఈ నెల 31న ఓ భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సన్నహాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో నాని అజాతశతృవు మాదిరి. అందుకే అతగాడు పిలిస్తే అందరూ వస్తారు. పైగా అ! సినిమాలో రవితేజ, కాజల్, దగ్గర నుంచి చాలా మందే వున్నారు.

సో వాళ్లందరినీ ఈ ఫంక్షన్ కు ఆహ్వానిస్తున్నారు. అలాగే నాని అభిమాన దర్శకుడు రాజమౌళి వస్తున్నారు. ఆయనతో పాటు ప్రభాస్, అనుష్క కూడా వస్తారని తెలుస్తోంది.

సుమారు 15మంది టాప్ సెలబ్రిటీలు గెస్ట్ లుగా వుండే ఈ ఫంక్షన్ గురించి, వెన్యూ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ఫిబ్రవరి 16మరో మూడు సినిమాలు వున్నాయి. సందీప్ కిషన్ ‘మనసుకు నచ్చింది’ మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’, రాజరథం సినిమాలు అదే రోజు షెడ్యూలు చేసుకుని వున్నాయి. ఆ ముందు వారం అయితే నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి.