కారూ పాయె.. సినిమా పాయె

సినిమా రంగంలో ప్రాజెక్ట్ లు సెట్ చేసుకోవడం అన్నది చాలా కష్టమైన పని. చాలా వ్యవహారాలు వుంటాయి. హీరోల దయాదాక్షిణ్యాలు వుంటే సరిపోదు. మధ్యవర్తులు, ఇతరత్రా వ్యవహారాలు వుండనే వుంటాయి. మేనేజర్లు, మధ్యవర్తులు ఇలా…

సినిమా రంగంలో ప్రాజెక్ట్ లు సెట్ చేసుకోవడం అన్నది చాలా కష్టమైన పని. చాలా వ్యవహారాలు వుంటాయి. హీరోల దయాదాక్షిణ్యాలు వుంటే సరిపోదు. మధ్యవర్తులు, ఇతరత్రా వ్యవహారాలు వుండనే వుంటాయి. మేనేజర్లు, మధ్యవర్తులు ఇలా చాలా మంది తెర వెనుక ప్రభావితం చేస్తారు ప్రాజెక్టును. ఇందుకోసం నిర్మాతకు కనిపించని ఖర్చులు వుంటాయి కూడా. 

ఆ మధ్య ఓ పెద్ద హీరోతో సినిమా సెట్ చేసుకోవడం కోసం ఓ పెద్ద నిర్మాణ సంస్థ కాస్త పెద్ద వ్యవహారమే నడిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆ పెద్ద హీరోకి ఈ పెద్ద నిర్మాణ సంస్థ ఏనాడో అడ్వాన్స్ చేతిలో పెట్టింది. కానీ ఆ హీరో ఎప్పుడు సినిమా చేస్తాడో? ఎప్పుడు చేయడో ఆయనకే తెలియని టైపు.

అందుకే మెల్లగా ఆ హీరోకి దగ్గరగా వుండే ఓ టాప్ డైరక్టర్ ను పట్టుకున్నారు. ఆ మధ్య ఆ హీరో వ్యవహారాలు అన్నీ ఆ టాప్ డైరక్టర్ నే నడిపించారని గుసగుసలు వున్నాయి. అందుకే మిగిలిన నిర్మాతల కన్నా తమ ప్రాజెక్టు ముందుకు జరిగేలా ఆ దర్శకుడినికి కాస్త మంచి చేసుకునేందుకు కాస్త భారీ కానుకలే సమర్పించుకున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా సమర్పించుకున్న వాటిల్లో ఖరీదైన ఓ నిర్మాత ఖరీదైన వాచీ, మరో నిర్మాత ఖరీదైన కారు వున్నాయని టాక్.

తీరా చేస్తే ఇప్పుడు ఆ హీరో సినిమాలు చేసే మూడ్ లో లేరు. చేస్తారో లేరో తెలియదు. అడ్వాన్స్ లు అయితే వెనక్కు వస్తాయి. కానీ ఇచ్చిన కానుకలు అయితే రావుగా.