సాయి పల్లవి: అక్కడ కూడా గలాట

సాయిపల్లవికి కాస్త టెక్కు ఎక్కువనే వార్తలు ఈమధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. ఎంసీఏ టైమ్ లో దిల్ రాజుకు చుక్కలు చూపించిందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈమెపై హీరో నాగశౌర్య ఓపెన్ గానే విమర్శలు…

సాయిపల్లవికి కాస్త టెక్కు ఎక్కువనే వార్తలు ఈమధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. ఎంసీఏ టైమ్ లో దిల్ రాజుకు చుక్కలు చూపించిందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈమెపై హీరో నాగశౌర్య ఓపెన్ గానే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సాయిపల్లవిపై మరో పుకారు జోరుగా షికారు చేస్తోంది.

తమిళనాట సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ నటిస్తోంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇలా మొదలైందో లేదో సాయిపల్లవి తన ప్రతాపం చూపించడం స్టార్ట్ చేసిందట. ఆమె వ్యవహార శైలితో దర్శకుడు తెగ ఇబ్బంది పడుతున్నాడంటూ కోలీవుడ్ లో కథనాలు వస్తున్నాయి.

నిజానికి తన డ్రీమ్ హీరో సూర్య అని, అతడి సరసన నటించే ఛాన్స్ వస్తే వదులుకోనని గతంలో ప్రకటించింది సాయిపల్లవి. లక్కీగా ఆ ఛాన్స్ చాలా తొందరగానే ఆమెను వరించింది. కానీ సెట్స్ లో ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని, షూటింగ్ కు టైమ్ కు రావట్లేదనే కంప్లయింట్స్ యూనిట్ నుంచి వినిపిస్తున్నాయి.

ఫిదాతో స్టార్ డమ్ తెచ్చుకున్న సాయిపల్లవి ఇంకా కెరీర్ స్టార్టింగ్ లోనే ఉంది. మంచి నటిగా, డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ కెరీర్ లో మరిన్ని సినిమాలు చేయాలంటే తన వ్యవహార శైలి మార్చుకోవాల్సి ఉంటుంది. తాజాగా సూర్య సినిమాపై వస్తున్నఈ పుకార్లకు సాయిపల్లవి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.