త్రివిక్రమ్ మాటల రచయితగా తప్ప కథా రచయితగా ఏనాడో చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తోంది. రీసెంట్ గా అ..ఆ, అజ్ఞాతవాసి సినిమాలకు వేరే వాళ్ల కథలను ఎత్తేసి, చివరి నిమిషంలో నానా బాధ పడ్డారు. అయితే అ..ఆ సినిమా తరువాత ఆయన రెండు నవలల హక్కులు కొన్నట్లు తెలుస్తోంది.
వాటిలో ఒకటి యద్దనపూడి సులోచనారాణి నవల. మరొకటి షాడో పాత్ర సృష్టికర్త, ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత మధుబాబు నవల. మధుబాబు రాసిన ఓ మాంచి నవలలోని పాయింట్ నచ్చి ఆ నవల హక్కులను త్రివిక్రమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ నవల ఆధారంగా ఓ యాక్షన్ థ్రిల్లర్ తీయాలన్నది త్రివిక్రమ్ ఆలోచన. అయితే కొన్న నవలల పేర్లేమిటి? ఈ రెండు నవలలను ఏ సినిమాల కోసం వాడబోతున్నారన్నది ఇంకా తెలియదు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఈ నవలలను సినిమాగా మార్చేటపుడయినా మూల కథ అనో, కథ అనో మధుబాబుకి, యద్దనపూడికి క్రెడిట్ ఇస్తారా? అన్నది చూడాలి. అందుకు త్రివిక్రమ్ ఇగో ఒప్పుకుంటుందా? అంటే అనుమానమే నేమో?