సినిమా ఘోర పరాజయం పొందితే, కచ్చితంగా హీరోకు కాస్తయినా నైతిక బాధ్యత వుంటుంది. అందునా 20కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నారని వార్తలు వినిపిస్తూ వున్నపుడు కచ్చితంగా ఎంతో కొంత వెనక్కు ఇవ్వాలి. లేదా ఓ సినిమా అయినా చేసి ఆదుకోవాలి అన్న సలహాలు వినిపిస్తాయి.
అజ్ఞాతవాసి సినిమా విడుదలకు ముందే నిర్మాత చినబాబుకు కాస్త అనుమానం వచ్చింది. ఈ సినిమా తేడా వస్తే మరో సినిమా చేయాలి మాకోసం అని పవన్ ను అడిగినట్లు అప్పుడే వార్తలు వినవచ్చాయి. దానికి అప్పట్లో పవన్ చూద్దాం అని సమాధానం ఇచ్చినట్లు వినికిడి.
కానీ ఇప్పుడు అజ్ఞాతవాసి బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. ఇలాంటి అలాంటి వైఫల్యం కాదు. దీంతో చినబాబు పవన్ ను ఏం చేద్దామంటూ సంప్రదించినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి పవన్ తాను ఏ విధంగానూ ఏమీ చేయలేనని చెప్పేసినట్లు తెలస్తోంది.
తాను తీసుకున్నదానికి చేసేసానని, తానేం చేయలేనని, చేతులు ఎత్తేసినట్లు తెలుస్తోంది. కావాలంటే పారితోషికం కాకుండా, లాభాలు వస్తే, తనకు అదనంగా ఇస్తానన్న పర్సంటేజ్ ను వదిలేసుకుంటా అని, అంతే తప్ప, వెనక్కు ఏమీ ఇవ్వలేనని పవన్ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
హరీష్ శంకర్ కూ నో
ఇదిలా వుంటే తమ దగ్గర వున్న జాలీ ఎల్ ఎల్ బి సబ్జెక్ట్ ను హరీష్ శంకర్ డైరక్షన్ లో సినిమా చేద్దామని హారిక హాసిని నిర్మాతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దానికి కూడా పవన్ నిరాకరించారని వినికిడి. తాను చేసేది లేదని ఆయన తెగేసి చెప్పేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
హరీష్ శంకర్ తో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గతంలో వుందని, అందువల్ల ఆయనతో చెద్దామని హారిక హాసిని జనాలు రిక్వెస్ట్ చేసినా, పవన్ అస్సలు మొహమాటపడకుండా నో అని చెప్పేసారట.