పార్టీ ఎవరిదైనా.. ఆ అమ్మాయి కామన్!

ఒక్క అమ్మాయి.. ఒకే ఒక్క అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్ లో హాట్ అయిపోయింది. ఇది తెరపై జరుగుతున్న మేటర్ కాదు. తెరవెనక నడుస్తున్న రసవత్తర వ్యవహారం. ఓ హీరోయిన్ ఇప్పుడు కొంతమంది హీరోలు,…

ఒక్క అమ్మాయి.. ఒకే ఒక్క అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్ లో హాట్ అయిపోయింది. ఇది తెరపై జరుగుతున్న మేటర్ కాదు. తెరవెనక నడుస్తున్న రసవత్తర వ్యవహారం. ఓ హీరోయిన్ ఇప్పుడు కొంతమంది హీరోలు, నిర్మాతలకు హాట్ ఫేవరెట్ అయిపోయింది. నిజానికి వీళ్లు ఆమెతో సినిమాలు చేయరు. కానీ తెరవెనక పార్టీల్లో మాత్రం ఆ అమ్మాయి కచ్చితంగా కనిపిస్తుంది.

పార్టీల్లో సినీజనాలకు “కోరుకున్నంత”, కావాల్సినంత వినోదాన్ని అందించి వెళ్లిపోతుందామె. అందుకే ఇప్పుడంతా ఆమెనే కోరుకుంటున్నారు. తెరపై ఆమె కనిపించకపోయినా ఫర్వాలేదు. తెరవెనక జరిగే పార్టీల్లో ఆమె ప్రజెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆ హీరోయిన్ 'సహకారం' ఆ రేంజ్ లో ఉంది మరి. 

ఈ వ్యవహారం ఎంతవరకు వచ్చిందంటే.. ప్రస్తుతం ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ.. ఇలా లేట్ నైట్ పార్టీల కోసం ఆమె కొన్ని సినిమాలు వదులుకుంటోంది. అంటే అటు సినిమాల్ని, ఇటు నైట్ పార్టీల్ని బ్యాలెన్స్ చేస్తోందన్నమాట.

ఈ నిర్ణయం వల్ల ఆమెకు ప్రేక్షకుల్లో హీరోయిన్ గా పెద్దగా గుర్తింపు రాకపోవచ్చు. కానీ ఇండస్ట్రీ సర్కిల్ లో బాగా నలుగుతోంది. డబ్బుకు డబ్బు, సీక్రెట్ పాపులారిటీ రెండూ వస్తున్నాయి. ఒంటిపై మెరుపు ఉన్నన్ని రోజులు ఈ పాపులారిటీ కొనసాగుతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.