సైరా సినిమాకు వచ్చిన బజ్ లో కీలకమైనది ఆ సినిమా కాస్టింగ్. సైరా సినిమాను బాహుబలి మాదిరిగా టోటల్ ఇండియన్ సినిమాగా మార్చే ప్రయత్నం చేసారు. చేస్తున్నారు.
అందులో భాగంగా కన్నడ, మళయాల, తమిళ స్టార్ లను ఒక్కొక్కరిని తీసుకోవాలనుకున్నారు. అలాగే కీలక పాత్రకు బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ ను కూడా తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆయన కూడా ఒకె అన్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.
కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న గుసగుస ఏమిటంటే, అమితాబ్ ఈ ప్రాజెక్టులో వుండకపోవచ్చని. కారణాలు తెలియరాలేదు, కానీ అమితాబ్ చేయకపోవచ్చని అంటున్నారు. నిజానిక అమితాబ్ పాత్ర ఈ సినిమాలో మరీ పెద్దదేమీ కాదు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురువుగారి పాత్ర అని తెలుస్తోంది. అదేమంత గొప్పదైన పాత్ర కాదు. అమితాబ్ కాకున్నా, ఎవరైనా సెట్ అవుతారు.
కానీ సినిమాకు బలం పెరగాలి అంటే ఆ రేంజ్ యాక్టర్ వుంటే వ్యవహారం వేరుగా వుంటుంది. అయితే అమితాబ్ సైడ్ నుంచి వున్న కమిట్ మెంట్ లు ఇతరత్రా వ్యవహారాల వల్ల చేయకపోవచ్చనే వర్తమానం మెగా క్యాంప్ కు అందినట్లు తెలుస్తోంది. దీని మీద మరి కాస్త క్లారిటీ రావాల్సివుంది.