మహేష్.. హ్యాండ్ మారింది

ఇవ్వాళ రేపు సోషల్ నెట్ వర్క్ మేనేజ్ మెంట్ అన్నది చాలా కీలకం అయిపోయింది. అది అంత వీజీ కాదు. హీరో ఫస్ట్ లుక్ లు, టీజర్లు, ట్రయిలర్లు లక్షలకు లక్షల హిట్ లు…

ఇవ్వాళ రేపు సోషల్ నెట్ వర్క్ మేనేజ్ మెంట్ అన్నది చాలా కీలకం అయిపోయింది. అది అంత వీజీ కాదు. హీరో ఫస్ట్ లుక్ లు, టీజర్లు, ట్రయిలర్లు లక్షలకు లక్షల హిట్ లు రావాలి అంటే ఈ మేనేజ్ మెంట్ దే కీలకపాత్ర. అందుకే ఇలాంటి మాంచి సంస్థలను నిర్మాతలు, హీరోలు ఏరి కోరి తెచ్చుకుంటూ వుంటారు.

నిన్నటికి నిన్న వచ్చిన భరత్ అనే నేను ఓథ్ టేకింగ్, ఫస్ట్ లుక్, ఇవన్నీ ట్విట్టర్ లో మోత మోగిపోవడం వెనుక ఇలాంటి వ్యవహారమే వుంది. అంతే కాదు రంగస్థలం టీజర్ అలా రికార్డులు బద్దలు కొట్టడం వెనుక ఇలాంటి వ్యవహారమే వుంది. అయితే ఈసారి భరత్ అనే నేను సినిమా కోసం కొత్త సోషల్ నెట్ వర్క్ మేనేజ్ మెంట్ టీమ్ రంగ ప్రవేశం చేసిందట.

ఇప్పటి వరకు మహేష్ సినిమాల సోషల్ నెట్ వర్క్ వ్యవహారాలు చూసే కంపెనీని పక్కన పెట్టారట. భరత్ అనే నేను సినిమా నిర్మాత దానయ్య కుమారుడు కళ్యాణ్ కు పాత కంపెనీకి అంతగా పొసగలేదని తెలుస్తోంది. ఆ కంపెనీ పనితీరు నచ్చని కళ్యాణ్ ఇప్పుడు కొత్త కంపెనీని భరత్ అనే నేను కోసం పట్టుకువచ్చారు. ఆ కంపెనీ వస్తూనే తన పని తీరు చూపించేసింది.

రిపబ్లిక్ డే నాడు ట్విట్టర్ లో మహేష్ మోత మోగిపోయింది. లక్షలాది ట్వీట్ లు, రీట్వీట్ లు, లైకులు, ఒకటేమిటి? హంగామానే హంగామా. ఈ లెక్కన ఇక భరత్ అనే నేను సినిమాకు సంబంధించి ఏమి వచ్చిన, ఇక హంగామా ఇలాగే వుంటుదనుకోవాలి. హ్యాండ్ మారితే మహేష్ కు మంచి రోజులు వస్తాయేమో.. వెయిట్ అండ్ సీ.