వినాయక్ భరోసా విలువ 32 కోట్లు

సాయిధరమ్ తేజ. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో. అలాంటి హీరో మీద 32కోట్లు ఇన్వెస్ట్ చేయడం అంటే ఏమనుకోవాలి? కచ్చితంగా పిచ్చితనం అంటారు ఎవరైనా చటుక్కునా. కానీ వివి వినాయక్ దర్శకుడు. అప్పుడు అయితే…

సాయిధరమ్ తేజ. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో. అలాంటి హీరో మీద 32కోట్లు ఇన్వెస్ట్ చేయడం అంటే ఏమనుకోవాలి? కచ్చితంగా పిచ్చితనం అంటారు ఎవరైనా చటుక్కునా. కానీ వివి వినాయక్ దర్శకుడు. అప్పుడు అయితే ఫరవాలేదేమో? అన్న మాట వినిపిస్తుంది.

ఇంటిలిజెంట్ సినిమా సంగతి ఇలాగే వుంది. ఈ సినిమాకు దర్శకుడు వివి వినాయక్. మామూలుగా అయన రెమ్యూనిరేషన్ నే 10 నుంచి 12కోట్లు. మరి ఆయన స్టయిల్ మేకింగ్ కు పదిహేను కోట్లు కావాల్సిందే. ఇక రెమ్యూనిరేషన్లు? అందుకే ఇంటిలిజెంట్ సినిమాకు 32కోట్ల వరకు అయిపోయిందట.

అంతే కాదు, ఇంకా చిత్రమైన విషయం వుంది. వినాయక్ భరోసాతో ఈ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరగడం. ఆంధ్ర అంతా 20కోట్ల రేంజ్ లో బిజినెస్ క్లోజ్ అయింది.

ఇది తెలిసి, వినాయక్ స్టామినా అంటే ఇది కదా? అనుకోవాల్సి వస్తోంది. సీడెడ్ ను రికార్డు ప్రయిస్ కు అమ్మారు. ఆంధ్ర సీడెడ్ అమ్మకాల అంకెలు వింటుంటే సాయిధరమ్ తేజను దృష్టిలో వుంచుకుంటే నమ్మశక్యంగా లేవు. కానీ వాస్తవాలు అని తెలుసుకుంటే ఇది కదా వినాయక్ స్టామినా అని అనుకోవాల్సి వస్తోంది.