ఇంటిలిజెంట్ గా వెదకాల్సిందేనా?

ఇంటిలిజెంట్ టీజర్ వచ్చింది. ఏముంది ఇందులో..? ఇంటిలిజెంట్ గా వెదకాల్సిందేనా? ఆదిలో ఈ సినిమా ధర్మా భాయ్ అనే పేరు పెట్టాలని హీరో సాయిధరమ్ తేజ, ఇంటిలిజెంట్ పేరు పెట్టాలని దర్శకుడు వినాయక్ కిందా…

ఇంటిలిజెంట్ టీజర్ వచ్చింది. ఏముంది ఇందులో..? ఇంటిలిజెంట్ గా వెదకాల్సిందేనా? ఆదిలో ఈ సినిమా ధర్మా భాయ్ అనే పేరు పెట్టాలని హీరో సాయిధరమ్ తేజ, ఇంటిలిజెంట్ పేరు పెట్టాలని దర్శకుడు వినాయక్ కిందా మీదా అయ్యారని వార్తలు వినవచ్చాయి.

టీజర్ చూస్తుంటే ధర్మా భాయ్ అన్నదే కరెక్టేమో అనిపిస్తోంది. ఎందుకంటే తెలుగు సినిమా ప్రేక్షకులు సవాలక్ష సార్లు, అనేకమంది హీరోలను చూసేసిన క్యారెక్టరైజేషన్ లాగే వుంది ఇంటిలిజెంట్ లో ధర్మా భాయ్ క్యారెక్టరైజేషన్. అంతకు మించి మరేం లేదు.

'ఇక మీదట పేదోడికి ఫ్లాట్ ఫామ్.. ధర్మా భాయ్ డాట్ కామ్' అన్న డైలాగ్ లో పంచ్ మాటేమో కానీ ఫన్నీగా వుంది. పేదోడు అన్న పదానికి, డాట్ కామ్ వ్యవహారానికి మ్యాచింగ్ ఏమిటో? పేదోళ్లకు అన్యాయం చేసే విలన్. హింసను హింసతోనే ఎదుర్కోనే హీరో అంతకు మించి యాభై రెండు సెకెండ్ల టీజర్ లో మరేం లేదు.