భాగమతి యువి హ్యాపీ

రెండేళ్లకు పైగా టెన్షన్ దిగిపోయింది. బాహుబలి టైమ్ నుంచి అనుకుంటున్న ప్రాజెక్టు. పైకి ముఫై అయిుదు కోట్లు అని చెబుతున్నా, మరో మూడు ఎక్కువే అయిందని బోగట్టా. ఎందుకంటే వడ్డీలు, ఖర్చులు రెండేళ్ల పాటు…

రెండేళ్లకు పైగా టెన్షన్ దిగిపోయింది. బాహుబలి టైమ్ నుంచి అనుకుంటున్న ప్రాజెక్టు. పైకి ముఫై అయిుదు కోట్లు అని చెబుతున్నా, మరో మూడు ఎక్కువే అయిందని బోగట్టా. ఎందుకంటే వడ్డీలు, ఖర్చులు రెండేళ్ల పాటు భరించాల్సి వచ్చింది.

ఇలాంటి సినిమా ఫైనాన్షియల్ గా ఎలా వుంటుందో అన్న టెన్షన్. అది కాస్తా ఫస్ట్ డే ఓపెనింగ్స్ తో మాయం అయిపోయింది. సినిమా పరిభాషలో చెప్పాలంటే వాస్తవానికి భాగమతి సినిమా 20కోట్ల డెఫిసిట్ లో విడుదలయింది.

ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ వదిలేసి, తమిళ, మళయాల, డిజిటిల్ రైట్స్ అన్నీ కలిపి 15కు పైగా వచ్చేసింది. మరో ఇరవైకి పైగా రావాలి. అందులో ఓవర్ సీస్, తెలుగు రాష్ట్రాల రైట్స్ ఇంకా శాటిలైట్ వుండనే వుంది. కాస్త టెన్షన్ గానే విడుదల చేసారు. ఎందుకంటే సినిమా టాక్ ను బట్టే కలెక్షన్లు, శాటిలైట్ ఆధారపడి వుంటాయి.

ఇప్పుడు ఆ టెన్షన్ అంతా తీరిపోయింది. ఫస్ట్ డే షేర్, ఫిక్స్ డ్ హైర్ లు అన్నీ కలిసి దగ్గర దగ్గర ఏడు కోట్ల వరకు వస్తున్నట్లు సమాచారం. శాటిలైట్ కనీసం అయిదు అన్నా వుంటుంది. ఇక ఫస్ట్ వీక్ కలెక్షన్లతో సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చన్న ధీమా వచ్చింది. అన్నింటికి మించి ఇప్పటి వరకు యువి నుంచి బ్యాడ్ మూవీ రాలేదు. ఇప్పుడు ఆ పేరు నిలబడింది. సో యువి ఇఫ్పుడు టెన్షన్ ఫ్రీ.