సునీల్ చాన్స్ తన్నకుపోయాడు

విజయం పలకరిస్తే అంతా మన వెంటే వుంటారు. లేదంటే వేరే దారి చూసుకుంటారు. హీరో సునీల్ పరిస్థితి అలాగే వున్నట్లుగా వుంది. చేతిలో ఒక సినిమా పక్కాగా వుంది. అల్లరి నరేష్ కాంబినేషన్ లో…

విజయం పలకరిస్తే అంతా మన వెంటే వుంటారు. లేదంటే వేరే దారి చూసుకుంటారు. హీరో సునీల్ పరిస్థితి అలాగే వున్నట్లుగా వుంది. చేతిలో ఒక సినిమా పక్కాగా వుంది. అల్లరి నరేష్ కాంబినేషన్ లో దర్శకుడు భీమినేని చేసే సినిమా.

అది కాక, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా వుంటుందన్న ఆశలు వున్నాయి. ఈ రెండూ కాక సోలో హీరోగా ఒక మాంచి సినిమా వుండాల్సి వుంది. చతురంగ వేట్టై అనే తమిళ సినిమా రీమేక్. అడ్వాన్స్ కూడా ఇచ్చారు.

కానీ నిర్మాత కృష్ణ ప్రసాద్ కు హీరో సునీల్ కు మైండ్ సెట్ ఎందుకో సెట్ కాలేదు. లేదా మరి సెట్ కాలేదన్నది సాకుగా చూపించారో? వేరే హీరోను వెదికేసి, పట్టేసుకున్నారు.

జ్యోతి లక్ష్మి సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన వైజాగ్ కుర్రాడు సత్యదేవ్ ఈ చాన్స్ ను పట్టుకుపోయాడు. ఇప్పటికే రెండు సినిమాలు సైలెంట్ గా షూట్ లో వున్నాయి ఈ కుర్రాడివి. ఇది మూడో సినిమా.

చతురంగ వేట్టై కాస్త సీరియస్ టోన్ లో నడుస్తుంది. దాన్ని కాస్త మారుద్దాం అన్నది సునీల్ ఆలోచన. జిరాక్స్ కాపీ తీద్దామన్నది నిర్మాత కృష్ణప్రసాద్ ఆలోచన. అక్కడ తేడా కొట్టింది వ్యవహారం.