ఆ హీరోకి మూడు సినిమాలు

గరుడవేగ సినిమాతో మళ్లీ లైన్లోకి వచ్చాడు హీరో రాజశేఖర్. మొత్తానికి ఆ సినిమా హిట్ అనిపించుకున్నా, మళ్లీ వెంటనే ఇప్పటి వరకు ప్రాజెక్టు ఏదీ సెట్ కాలేదు. ఏ న్యూస్ బయటకు రాలేదు. అయితే…

గరుడవేగ సినిమాతో మళ్లీ లైన్లోకి వచ్చాడు హీరో రాజశేఖర్. మొత్తానికి ఆ సినిమా హిట్ అనిపించుకున్నా, మళ్లీ వెంటనే ఇప్పటి వరకు ప్రాజెక్టు ఏదీ సెట్ కాలేదు. ఏ న్యూస్ బయటకు రాలేదు. అయితే వాస్తవానికి మూడు ప్రాజెక్టులు సెట్ చేసుకుని, రాజశేఖర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఒక ప్రాజెక్ట్ ను గరుడవేగ నిర్మించిన జ్యో బ్యానర్ పైనే నిర్మిస్తారట. మణిరత్నం దగ్గర చిరకాలం అసిస్టెంట్ గా పనిచేసిన గోపి అనే కొత్త దర్శకుడు తెచ్చిన కథ బాగా నచ్చడంతో ముందుగా అది స్టార్ట్ చేస్తున్నారట.

అదే సమయంలో కన్నడ దర్శకుడు నాగశేఖర్ ఓ కథ తెచ్చాడట. అందులో శివాని, ఓ యంగ్ హీరో నటిస్తారు. ఈ సినిమాలో రాజశేఖర్ ది కీలకపాత్రగా వుంటుందట. ఈ రెండు సినిమాలు స్టార్ట్ చేసి ఫినిష్ చేసాక, మరో సినిమా స్టార్ట్ చేస్తారట. దానికి నిర్మాతలు వున్నారు కానీ, కథ, దర్శకుడు కావాలట.

మొత్తానికి కాస్త ప్రామిసింగ్ గా అనిపించే రెండు ప్రాజెక్టులతో ఫిబ్రవరిలో తన బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకోబోతున్నాడట హీరో రాజశేఖర్. థాంక్స్ టు ప్రవీణ్ సత్తారు.