దర్శకేంద్రుడు ఊహించని ట్విస్ట్

రాఘవేంద్రరావుకు టీటీడీ చైర్మన్ అని వార్తలు గుప్పుమన్నాయి. చిత్రమేమిటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విషయాన్ని అస్సలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాట్సప్ సందేశాలు మాత్రం తెగ అటు ఇటు తిరిగేసాయి. దర్శకుడు రాఘవేంద్రరావుకు…

రాఘవేంద్రరావుకు టీటీడీ చైర్మన్ అని వార్తలు గుప్పుమన్నాయి. చిత్రమేమిటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విషయాన్ని అస్సలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాట్సప్ సందేశాలు మాత్రం తెగ అటు ఇటు తిరిగేసాయి. దర్శకుడు రాఘవేంద్రరావుకు ఎలాగూ టీటీడీ చైర్మన్ మీద కన్ను వుంది, పైగా చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి జరిగే వుంటుందని అనుకున్నారంతా.

అయితే బాబుగారి సంగతి తెలిసిన వారు మాత్రం, ఆయన అలా ఎందుకు చేస్తాడు? అని అనుకున్నారు. ఎందుకంటే ఎన్నికల దగ్గరకు వస్తున్న తరుణంలో కీలమైన పదవి ఇవ్వాలంటే అయితే బిసిలు లేదా కాపులకు ఇస్తాడు కానీ, తన సామాజిక వర్గానికే కట్టబెట్టే సాహసం చేస్తారా? అని అనుకున్నారు. పైగా రాఘవేంద్రరావుకు ఇప్పుడు ఇది ఇచ్చినా, ఇవ్వకున్నా, వచ్చిన ప్లస్సూ లేదు. మైనస్సూ లేదు. అలాంటపుడు బాబుగారు ఎందుకు సై అంటారు?

కాపులను, వెలమలను, యాదవులను దగ్గరకు తీయాల్సిన పరిస్థితి వుంది. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఓకె. దానికి ప్రతిగా బిసిలకు ఏదో ఒకటి చేసి బుజ్జగించాలి. అలా అంటే యాదవులకు ఈ పదవి ఇవ్వాలి. అదే సమయంలో తూర్పు, పశ్చిమ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో వున్న వెలమలను దగ్గరకు తీయాలి.

ఇన్ని ఈక్వేషన్లు వున్న టైమ్ లో రాఘవేంద్రరావుకు ఇస్తారా? అన్నది అనుమానం. మరోపక్క ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. గడిచిన మూడేళ్లు బాబుగారి సామాజిక వర్గానికి ఎంత చేయాలో అంతా చేసేసారు అన్నది రాజకీయ వర్గాల బోగట్టా. ఈ మూడేళ్లలో కోస్తాలో ఆ వర్గం ఎన్ని విధాలుగా ప్రయోజనం పొందిందన్నది గ్రౌండ్ లెవెల్ లో వున్నవారికి తెలిసిన విషయం. ఇక ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి, కాస్త బ్రేక్ తీసుకోమనడం సహజం.

ఇలాంటి టైమ్ లో టీటీడీ పదవిపై ఫుట్టిన ఫీలర్ బాబుగారినో, చినబాబుగారినో కాస్త చికాకు పెట్టి వుంటుంది. అందుకే వెంటనే ఖండిచమని ఓ తాఖీదు వెళ్లి వున్నా ఆశ్చర్యం లేదు. దాంతో అర్జెంట్ గా ప్రకటన చేయాల్సి వచ్చి వుంటుంది. లేదూ అంటే, పండగ వెళ్లిన పదోనాడు అన్నట్లుగా, ఫీలర్లు బలంగా బయటకు వచ్చేసి, సినిమా గ్యాసిప్ మాదిరిగా వ్యాపించేసిన తరువాత ఇపుడు ఖండన ఇవ్వడం ఏమిటి? ఇంటర్వేల్ అయిపోయిన తరువాత కథను మలుపు తిప్పి, బ్యాంగ్ అన్నట్లుగా.