హీరోగా ముచ్చటగా మూడో కళ్యాణ్

పవన్ కళ్యాణ్ అయ్యాడు. మెగా అల్లుడు కళ్యాణ్ రెడీ అవుతున్నాడు. ఇప్పడు మరో కళ్యాణ్ కూడా హీరోగా రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. బడా నిర్మాత కొడుకే ఈ కళ్యాణ్. బెల్లంకొండ సురేష్. సుధాకరరెడ్డి…

పవన్ కళ్యాణ్ అయ్యాడు. మెగా అల్లుడు కళ్యాణ్ రెడీ అవుతున్నాడు. ఇప్పడు మరో కళ్యాణ్ కూడా హీరోగా రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. బడా నిర్మాత కొడుకే ఈ కళ్యాణ్. బెల్లంకొండ సురేష్. సుధాకరరెడ్డి నిర్మాతలే. వాళ్ల పిల్లలు శ్రీనివాస్, నితిన్ హీరోలు అయ్యారు. ఇప్పుడు ఇదే బాటలో నిర్మాత డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ కూడా హీరోగా కావాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

అయితే ఎంట్రీ కాస్త భారీగా వుండాలని ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తండ్రి బడా నిర్మాత కావడంతో బడా డైరక్టర్లను తనతో సినిమా చేసే అవకాశం పరిశీలించమని కోరుతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా కొరటాల శివను కూడా కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకోసం కనీ వినీ ఎరుగని భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చేయాలంటే చేసేయచ్చు. ఏముందీ వరుసగా నాలుగు భారీ సినిమాలు చేసి, కాస్త రిలాక్స్ కోసం చేయచ్చు.

ఇప్పటికే ఇతగాడు జిమ్మాస్టిక్స్ ఇతరత్రా హీరోచిత విద్యలు అన్నీ నేర్చేసుకుని, నిర్మాణం గురించి కూడా నేర్చుకునేందుకు, భరత్ అనే నేను, రామ్ చరణ్-బోయపాటి సినిమా వ్యవహారాలు చూస్తున్నాడట.