మహేష్ బాబు ఓదార్పు యాత్ర ప్రారంభం

స్పైడర్ తో దెబ్బతిన్న బయ్యర్లలో చాలామందిని ఆదుకునేందుకు రెడీ అవుతున్నాడు మహేష్. ఇందులో భాగంగా ముందుగా అందరికంటే పెద్ద దెబ్బ తగిలిన దిల్ రాజును ఆదుకోబోతున్నాడు. నిర్మాత డీవీవీతో సంప్రదింపులు జరిపి కాస్త తక్కువకే…

స్పైడర్ తో దెబ్బతిన్న బయ్యర్లలో చాలామందిని ఆదుకునేందుకు రెడీ అవుతున్నాడు మహేష్. ఇందులో భాగంగా ముందుగా అందరికంటే పెద్ద దెబ్బ తగిలిన దిల్ రాజును ఆదుకోబోతున్నాడు. నిర్మాత డీవీవీతో సంప్రదింపులు జరిపి కాస్త తక్కువకే భరత్ అనే నేను సినిమా హక్కుల్ని ఇచ్చేలా మేటర్ సెట్ చేస్తున్నాడు. రేపోమాపో ఈ వ్యవహారం సెటిల్ అవుతుంది.

అలా అని దిల్ రాజు స్పైడర్ లాస్ మొత్తం ఈ సినిమాతోనే కవర్ అవ్వదు. నెక్ట్స్ ఎలాగూ దిల్ రాజు బ్యానర్ లోనే మూవీ ఉంది కాబట్టి, మిగతా లెక్కలు అప్పుడు చూసుకుంటారు. అంటే ఒక్క నైజాం లాస్ ను భర్తీ చేసేందుకు ఏకంగా రెండు సినిమాల్లో రిబేటు ఇవ్వాల్సి వస్తోందన్నమాట.

దిల్ రాజుతో పాటు మరికొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు కూడా తన వంతుగా కాస్త ఎమౌంట్ సర్దుబాటు చేయబోతున్నాడు మహేష్. స్పైడర్ తో లాస్ అయిన కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు భరత్ అనే నేను సినిమాతో పాటు దిల్ రాజు బ్యానర్ లో చేయబోయే తన 25వ సినిమాను కూడా కాస్త తక్కువకు ఇప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నాడు. కాకపోతే ఇదంతా పూర్తిస్థాయి భర్తీ కాదు, ఉన్నంతలో కాస్త ఆదుకునే ప్రాసెస్ మాత్రమే. 

గతంలో మహేష్ తండ్రి కృష్ణ ఇలానే చేసేవారు. సినిమాకు నష్టం వచ్చినప్పుడు డబ్బులు వెనక్కి ఇచ్చే పద్ధతి పెట్టుకోకుండా.. తర్వాత సినిమాల్లో సర్దుబాట్లు చేసేవారు. ఒకానొక దశలో రెమ్యూనరేషన్ తీసుకోకుండా కొన్ని సినిమాలు ఫ్రీగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరీ కృష్ణ అంత కాకపోయినా, ఉన్నంతలో మహేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను కొంతయినా ఆదకునేందుకు ఇలా ఓదార్పు యాత్ర షురూ చేశాడు.