ఇప్పుడూ కూర్చోపెడతారా?

పవన్ పై హక్కుల పోరాటం అంటూ ఎక్కే చానెల్, దిగే చానెల్ మాదిరిగా అలుపు ఎరగకుండా మాట్లాడాడు కత్తి మహేష్. ఆ పోరాటం ముగిసినట్లే. ఇప్పుడు ఆంధ్ర సిఎమ్ పక్కా దళిత వ్యతిరేకి అంటున్నాడు.…

పవన్ పై హక్కుల పోరాటం అంటూ ఎక్కే చానెల్, దిగే చానెల్ మాదిరిగా అలుపు ఎరగకుండా మాట్లాడాడు కత్తి మహేష్. ఆ పోరాటం ముగిసినట్లే. ఇప్పుడు ఆంధ్ర సిఎమ్ పక్కా దళిత వ్యతిరేకి అంటున్నాడు. దానికి కారణం కూడా వివరించాడు.

ఇక ఇప్పుడు కావాల్సింది., ఇప్పుడు కూడా టీవీ9, ఎబిఎన్, మహా టీవీలు మహేష్ ను ఆహ్వానించి నాలుగేసి గంటలు ఈ విషయమై చర్చలు సాగిస్తాయా? ఫన్ ఇన్ లైవ్ లు, అలాగే వివిధ పార్టీల జనాలను తీసుకువచ్చి, మహేష్ కత్తితో కూర్చో పెట్టి డిస్కషన్లు సాగిస్తాయా?

మహేష్ కత్తి చిన్న మాట, చితకమాట అనలేదు చంద్రబాబును. దళిత ద్రొహి అన్నాడు. మరోపక్క మంద కృష్ణ మాదిగ కూడా కోపంగానే వున్నాడు. ఇలాంటి నేపథ్యంలో లెక్క ప్రకారం రోజుకు కనీసం నాలుగు గంటలు వంతున ఒక్కో చానెల్ డిస్కషన్లు రన్ చేయాలి. కానీ చేస్తాయా? పవన్ కళ్యాణ్ కాదు, చానెళ్లు నానా గత్తర చేయడానికి అక్కడున్నది చంద్రబాబు. ఏమవుతుందో? చేసి చూస్తే కదా తెలిసేది.